ధాన్యాన్ని లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్‌ చేపట్టాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-11-03T05:09:43+05:30 IST

యాసంగి వరి ధాన్యాన్ని మిల్లర్లు రోజువారి లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్‌ చేపట్టాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.

ధాన్యాన్ని లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్‌ చేపట్టాలి : కలెక్టర్‌

కామారెడ్డి, నవంబరు 2: యాసంగి వరి ధాన్యాన్ని మిల్లర్లు రోజువారి లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్‌ చేపట్టాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోనే సమావేశ మందిరంలో రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరు 30లోగా మిల్లింగ్‌ పూర్తి చేయాలని సూచించారు. యాసంగిలో కొనుగోలు చేపట్టిన ధాన్యంలో 30 శాతం మిల్లింగ్‌ పూర్తయినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌డీవోలు రాజాగౌడ్‌, శ్రీను, సివిల్‌ సప్లయ్‌ డీఎం జితేంద్రప్రసాద్‌, ఇన్‌చార్జ్‌ డీఎల్‌ఎస్‌వో రాజశేఖర్‌, జిల్లా రైస్‌మిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌరిశంకర్‌, రైస్‌మిల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ధరణి పెండింగ్‌ పైళ్లను తక్షణమే పరిష్కరించాలి
ధరణిలో పెండింగ్‌లో ఉన్న పైళ్లను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలోని తన చాంబర్‌ నుంచి తహసీల్దార్‌లతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాజంపేటలో 15, మాచారెడ్డి 13 పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వీటిని తక్షణమే పరిష్కరించినట్లు ఆదేశించారు. ఎల్‌ఎంలో పెండింగ్‌ మ్యూటేషన్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ ఏవో రవీందర్‌, ఆర్‌డీఓలు రాజాగౌడ్‌, శ్రీను, తహసీల్దార్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-03T05:09:43+05:30 IST