‘మొక్కలను సంరక్షించకుంటే ప్రభుత్వ పథకాలు దూరం’

ABN , First Publish Date - 2021-07-09T05:17:54+05:30 IST

హరితహారంలో భాగంగా ఇంటికి ఆరు మొక్కలు నాటి సంకక్షించకుంటే ప్రభుత్వ పథకాలు అందవని హసాకొత్తూర్‌ సర్పంచ్‌ ఏనుగు పద్మ, ప్రత్యేక అధికారి ఆంధ్రయ్య, ఎంపీవో శ్రీనివాస్‌ గౌడ్‌ గ్రామస్థులకు సూచించారు.

‘మొక్కలను సంరక్షించకుంటే ప్రభుత్వ పథకాలు దూరం’


కమ్మర్‌పల్లి, జూలై 8: హరితహారంలో భాగంగా ఇంటికి ఆరు మొక్కలు నాటి సంకక్షించకుంటే ప్రభుత్వ పథకాలు అందవని హసాకొత్తూర్‌ సర్పంచ్‌ ఏనుగు పద్మ, ప్రత్యేక అధికారి ఆంధ్రయ్య, ఎంపీవో శ్రీనివాస్‌ గౌడ్‌ గ్రామస్థులకు సూచించారు. హసాకొత్తూర్‌ గ్రామంలో గురువారం గ్రామ మహిళా సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేశారు. మొక్కలు చనిపోతే వాటి స్థానంలో మరోమొక్క నాటాలని, ఇళ్లలో ఆరు మొక్కలు లేనిచో ప్రభుత్వ పథకాలు అందవని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ ఏనుగు రాజేశ్వర్‌, సీసీ నవీన్‌ కుమార్‌, కార్యదర్శి శ్రీనివాస్‌, కారోబార్‌ రమణ వార్డుసభ్యులు శ్రావన్‌, శ్రీనివాస్‌, మహేందర్‌, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-09T05:17:54+05:30 IST