రైతులకు అండగా ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-10-21T06:02:24+05:30 IST

ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు రైతులకు అండగా ఉం టుందని రాష్ట్ర గృహ నిర్మాణ, ఆర్‌అండ్‌బి, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో గల ప్రగతిభవన్‌లో ధాన్యం సేకరణపై తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై బుధవారం జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

రైతులకు అండగా ప్రభుత్వం
మాట్లాడుతున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమీక్ష

నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 20: ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు రైతులకు అండగా ఉం టుందని రాష్ట్ర గృహ నిర్మాణ, ఆర్‌అండ్‌బి, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో గల ప్రగతిభవన్‌లో ధాన్యం సేకరణపై తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై బుధవారం జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎఫ్‌సీఐ నిర్దేశించిన లక్ష్యానికి మించి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లకు సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలకు జిల్లా రైతులపక్షాన కృతజ్ఞతలు తెలియ జేస్తున్నామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లాలో ధాన్యం సేకరణకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకుని అవసరమైన అన్ని యంత్రాలను సమకూర్చుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. పెద్దసంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ఇబ్బం దులు లేకుండా వెంటనే రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎఫ్‌సీఐ నిర్దేశించిన నియమ, నిబంధనల ప్రకారం రైతులు ఎఫ్‌ఏక్యూ కలిగిన ధాన్యాన్ని తీసుకువచ్చేవిధంగా గ్రామ, మండలస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ సీ. నారాయణరెడ్డి, జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, ఎమ్మెల్సీ వీజీగౌడ్‌, అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా, అదనపు సీపీ అర్వింద్‌, డీసీసీబీ వైస్‌చైర్మన్‌ రమేష్‌రెడ్డి, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, డీసీఎంఏ చైర్మన్‌ మోహన్‌, ఆయా శాఖాల అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-21T06:02:24+05:30 IST