సాఫ్ట్‌బాల్‌పోటీల్లో జిల్లా క్రీడాకారులకు బంగారు పతకాలు

ABN , First Publish Date - 2021-12-19T05:32:29+05:30 IST

జాతీయ సబ్‌జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులకు బంగారు పతకాలు సాధించినట్లు జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, గంగామోహన్‌ తెలిపారు. జిల్లాకు చెందిన ఎల్‌.రా ణి, సౌందర్య, ఎం.సౌమ్య, జే.వైశాలి, కే.సృజన, ఎం. మీనాలు బంగారు పతకం సాధించినట్లు తెలిపా రు. ఈ నెల 15 నుంచి 18 వరకు గుజరాత్‌ రాష్ట్రంలోని మహమ్మదాబాద్‌లో జరిగిన 34వ జాతీయ సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టు తరపున పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి పతకాన్ని తేవడంలో ఈ క్రీడాకారులు ముఖ్యభూమిక పోషించారని తెలిపారు. ఈ టోర్నీలో బెస్ట్‌ పిక్చర్‌గా ఎల్‌.రాణి ప్రత్యేక బహుమతి అందుకుందని తెలిపారు. జట్టుకు కోచ్‌, మేనేజర్‌లుగా అనికేత్‌లు వ్యవహరించారు. బంగారు పతకం సాదించడంపట్ల జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ లింగం హర్షం వ్యక్తం చేశారు.

సాఫ్ట్‌బాల్‌పోటీల్లో జిల్లా క్రీడాకారులకు బంగారు పతకాలు

సుభాష్‌నగర్‌, డిసెంబరు 18: జాతీయ సబ్‌జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులకు బంగారు పతకాలు సాధించినట్లు జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, గంగామోహన్‌ తెలిపారు. జిల్లాకు చెందిన ఎల్‌.రా ణి, సౌందర్య, ఎం.సౌమ్య, జే.వైశాలి, కే.సృజన, ఎం. మీనాలు బంగారు పతకం సాధించినట్లు తెలిపా రు. ఈ నెల 15 నుంచి 18 వరకు గుజరాత్‌ రాష్ట్రంలోని మహమ్మదాబాద్‌లో జరిగిన 34వ జాతీయ సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టు తరపున పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి పతకాన్ని తేవడంలో ఈ క్రీడాకారులు ముఖ్యభూమిక పోషించారని తెలిపారు. ఈ టోర్నీలో బెస్ట్‌ పిక్చర్‌గా ఎల్‌.రాణి ప్రత్యేక బహుమతి అందుకుందని తెలిపారు. జట్టుకు కోచ్‌, మేనేజర్‌లుగా అనికేత్‌లు వ్యవహరించారు. బంగారు పతకం సాదించడంపట్ల జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ లింగం హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-19T05:32:29+05:30 IST