ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-03-14T05:43:30+05:30 IST

ఉమ్మడి నిజామాబా ద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మది న వేడుకలను శనివారం నగరంలో అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, మేయర్‌ దండు నీతూ కిరణ్‌ ఆధ్వర్యంలో ఘ నంగా నిర్వహించారు.

ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు
బాల సదన్‌లో కేక్‌ కట్‌ చేస్తున్న మేయర్‌, మాజీ మేయర్‌ తదితరులు

నిజామాబాద్‌ అర్బన్‌, మార్చి 13: ఉమ్మడి నిజామాబా ద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మది న వేడుకలను శనివారం నగరంలో అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, మేయర్‌ దండు నీతూ కిరణ్‌ ఆధ్వర్యంలో ఘ నంగా నిర్వహించారు. నగరంలోని న్యూ అంబేద్కర్‌ భవన్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆశ వర్కర్లు, ఏ ఎన్‌ఎంల సమక్షంలో ఎమ్మెల్యే బిగాల గణే ష్‌ గుప్తా కేక్‌కట్‌ చేశారు. అనంతరం కొవి డ్‌ సమయంలో తమ ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించిన ఏఎన్‌ఎంలు, ఆ శ వర్కర్లకు ఎమ్మెల్యే చీరలు పంపిణీ చే శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు సేవ చేసిన వారిని గౌరవించుకోవడం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ దండు నీతూ కిర ణ్‌, ఎమ్మెల్సీ ఆకుల లలిత, రెడ్‌కో చైర్మన్‌ ఎస్‌ఏ అలీం, మాజీ మేయర్‌ ఆకుల సు జాత, ఖుద్దూస్‌, దారం సాయిలు, డీఎం హెచ్‌వో సుదర్శనం, నాయకులు సుజీత్‌సింగ్‌ ఠాకూర్‌, న్యాలం కిషన్‌ పాల్గొన్నారు. 

నగర మేయర్‌ ఆధ్వర్యంలో

శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని నగ ర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ ఆధ్వర్యం లో నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహి ంచారు. సుభాష్‌నగర్‌లోని బాల సదన్‌లో అనాథ పిల్లల మధ్య ఎమ్మెల్సీ కవిత జన్మదినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ నీతు కిరణ్‌, మాజీ మేయర్‌ ఆకు ల సుజాత, మహిళా కార్పొరేటర్‌లు కేక్‌క ట్‌ చేశారు. అదేవిధంగా సిర్ప రాజు ఆధ్వ ర్యంలో నగరంలోని రాజరాజేంద్ర చౌరస్తా వద్ద గల హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను నిర్వహించారు.

జిల్లా సర్పంచ్‌ల సమాఖ్య ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ఎమ్మెల్సీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా స ర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు ఏటీఎస్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యం లో జిల్లాలోని సర్పంచ్‌ల కుటుంబాలకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్‌ చై ర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావ్‌ ప్రారంభించారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత గతంలో ఎం పీగా పనిచేసిన కాలంలో జిల్లాను అన్ని రంగాల్లో ముందు కు తీసుకెళ్లారని, ఇప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు రాంకిషన్‌రావ్‌, వైద్యులు జీవన్‌రావ్‌, విశాల్‌, హరికృష్ణ, రాజేంద్రప్రసాద్‌, ర మణేశ్వర్‌, రాజశేఖర్‌, సందీప్‌, సంధ్యరాణి పాల్గొన్నారు.

నవీపేట మండలంలో

నవీపేట: మండలంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మ దిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. స్థాని క మోడల్‌ పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కేక్‌ కట్‌ చేసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం నవీపేట సొసైటీ వైస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు క్రీడా సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ హ రీశ్‌ కుమార్‌, నర్సింగరావు, మల్లేష్‌, అబ్బన్న, సూరిబాబు, సుదర్శన్‌, బుచ్చన్న, రాజు, మౌలానా తదితరులు పాల్గొన్నా రు. కవిత అత్తగారి గ్రామమైన పోతంగల్‌లో కేక్‌కట్‌ చేసి విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. బినోలా సొసైటీ చై ర్మన్‌ మగ్గారి హన్మాండ్లు కవిత జన్మదినం సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకొని పూజలు నిర్వ హించారు. బినోలా సొసైటీ మాజీ చైర్మన్‌ కిషోర్‌రావు మో కన్‌పల్లి కేజీబీవీ పాఠశాలతో పాటు జన్నెపల్లి, బినోలా, నాళే శ్వర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థు లకు పరీక్ష ప్యాడ్‌లు, పెన్నులు, కంపాక్స్‌ బాక్స్‌లను అంద జేశారు. ఈ కార్యక్రమంలో సంజీవ్‌రావు, వీరేందర్‌రావు త దితరులు పాల్గొన్నారు. మండల జాగృతి కన్వీనర్‌ శ్రీకాంత్‌ నాయక్‌ ఆధ్వర్యంలో నవీపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రో గు లకు పండ్లు పంపిణీ చేశారు. 

మోర్తాడ్‌లో 

మోర్తాడ్‌: మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయం లో శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు వే డుకలను టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహిం చారు. మండల అధ్యక్షుడు ఏలియ కేక్‌కట్‌ చేశారు. ఈ కా ర్యక్రమంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్‌, జడ్పీటీసీ బద్దం రవి, సర్పంచ్‌లు బోగ ధరణి ఆనంద్‌, గడ్డం చిన్నారెడ్డి, సం తోష్‌, బద్దం గంగారెడ్డ, కడారి శ్రీనివాస్‌, కత్తి ముత్తెన్న, దే వన్న, ఎంపీటీసీ సభ్యులు ఎలాల రాజ్‌పాల్‌రెడ్డి, టి.శ్రీనివా స్‌, అశోక్‌, తీగెల గణేష్‌రెడ్డి, బద్దం అశోక్‌రెడ్డి, మోత్కు ము త్తెన్న, జేసీ గంగారెడ్డి, మహిపాల్‌, ఇంతియాజ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు చిన్నయ్య, పర్స దేవన్న, కార్యకర్తలు పాల్గొన్నా రు. అనంతరం నూతనంగా ఎన్నికైన కేంద్ర సహకార బ్యా ంకు డైరెక్టర్‌ మోత్కు ముత్తెన్నను ఎంపీపీ శివలింగు శ్రీని వాస్‌, ఏలియా, జడ్పీటీసీ బద్దం రవి, టీఆర్‌ఎస్‌ నాయకు లు ఘనంగా సన్మానించారు.

Updated Date - 2021-03-14T05:43:30+05:30 IST