ఘనంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-03-15T04:13:48+05:30 IST

రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జన్మదినం పురస్కరించుకొని వేల్పూర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నాయ కులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు
వేల్పూర్‌లో మంత్రి నివాసంలో కేక్‌ కట్‌ చేస్తున్న ప్రజాప్రతినిధులు


వేల్పూర్‌, మార్చి14: : రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జన్మదినం పురస్కరించుకొని వేల్పూర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నాయ కులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేల్పూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌చైర్మన్‌ రమేష్‌రెడ్డి, ఎంపీపీ బీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, ఏఎంసీచైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి, ఆర్‌టీఏ జిల్లా కమిటీ సభ్యుడు రేగుల్ల రాములు, వైస్‌ఎంపీపీ సురేష్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగాధర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌ లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు మంత్రి జన్మదిన వేడుకలను నిర్వ హించారు. అందులో భాగంగా వేల్పూర్‌లో ఆర్టీసీ బస్సుల ప్రయాణికులకు, ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పడిగెల బీసీ హాస్టల్‌లో ఏఎం సీచైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి, సర్పంచ్‌ ద్యావతి రాజ్‌కుమార్‌, సొసైటీచైర్మన్‌ హన్మంతు, ఎంపీటీసీలు శ్యామ్‌రావు, రాజేందర్‌, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌లు వి ద్యార్థులకు పండ్లు పంపిణీ చేసి డబుల్‌బెడ్‌రూం ఇళ్ల స్థలాల వద్ద మొక్కలు నాటారు. పచ్చలనడ్కుడ శివారులోని జాన్కం౉ పట్‌ వద్ద కేజీబీవీలో జడ్పీటీసీ భారతి, సర్పంచ్‌ ఏనుగు శ్వేత గంగారెడ్డి, ఎంపీటీసీ గుడాల గంగాధర్‌, నో ముల గంగారెడ్డి, సొసైటీ చైర్మన్‌ రాజారెడ్డి, టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు కేక్‌ కట్‌ చేసి పండ్లు పంపిణీ చేశారు. కోమన్‌పల్లి, మోతె గ్రామాలో రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఏఎంసీచైర్మన్‌ డైరెక్టర్‌ బాల్‌రాజ్‌, సర్పంచ్‌ రజిత, ఎంపీ టీసీ డోల్ల రాజేశ్వర్‌రెడ్డి, కోమన్‌ పల్లిలో సర్పంచ్‌ పత్రి మంజుల రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో కక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా వేల్పూర్‌ లోని రామాల యంలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు వేముల ప్రశాంత్‌రెడ్డి పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. చర్చిలో ప్రార్థనలు చేశారు. అనం తరం మంత్రి నివాసంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఎంపీపీ జమున, జడ్పీటీసీ భారతి కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టారు.

మెండోరలో..

మెండోర : రాష్ట్ర రోడ్డు భవనాల, గృహ నిర్మాణ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెండోరలో డీసీసీబీ డైరెక్టర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగంపేట్‌శేఖర్‌ కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తలారి గంగాధర్‌, సొసైటీ చైర్మన్‌ మచ్చర్ల రాజారెడ్డి, కమలాకర్‌, సర్పంచ్‌లు మచ్చర్ల లక్ష్మీ, రాజారెడ్డి, సామ గంగారెడ్డి, గోలి ప్రకాష్‌, గోపిడి గంగారెడ్డి, పసుల సుజాత శ్రీనివాస్‌, నెల్ల లింగన్న, బాబా, రవిగౌడ్‌ నవీన్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.  

ఏర్గట్లలో 

ఏర్గట్ల: రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆ దివారం ఏర్గట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం, తాళ్లరాంపూర్‌ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్‌కట్‌ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి, జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్‌, టీఆర్‌ఎస్‌ మండలా ధ్య క్షుడు ఎనుగందుల రాజాపూర్ణానందం, కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ అశ్రఫ్‌, ఎం పీటీసీ జక్కని మధుసూదన్‌, సొసైటీ చైర్మన్‌ బర్మ చిన్న నర్సయ్య, సర్పంచ్‌లు పత్తిరెడ్డి ప్రకాష్‌ రెడ్డి, కట్కం పద్మసాగర్‌, మోత్కూరి మంజుల బాలాజీ గౌడ్‌, గద్దెరాధ గంగారాం, భీమనాతి భానుప్రసాద్‌, కుండ నవీన్‌, ఉపసర్పంచ్‌లు సోమిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, చిలుక కిషన్‌, క్యాతం దేవేందర్‌, నాయకులు నాగులపెల్లి అంజిరెడ్డి, తుపాకుల శ్రీనివాస్‌ గౌడ్‌, బద్ధం ప్రభాకర్‌, బోనగిరి రమేష్‌, ఓర్సు రాములు పాల్గొన్నారు.  

Updated Date - 2021-03-15T04:13:48+05:30 IST