ఘనంగా మే డే వారోత్సవాలు

ABN , First Publish Date - 2021-05-03T05:19:10+05:30 IST

బోధన్‌ మండలం కల్దూర్కి, సిద్దాపూర్‌ తది తర గ్రామాల్లో ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వారోత్సవాల్లో భాగంగా ఆయా గ్రామాల్లో జెండాను ఎగురవేశారు.

ఘనంగా మే డే వారోత్సవాలు

బోధన్‌రూరల్‌, మే 2 : బోధన్‌ మండలం కల్దూర్కి, సిద్దాపూర్‌ తది తర గ్రామాల్లో ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వారోత్సవాల్లో భాగంగా ఆయా గ్రామాల్లో జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌ మాట్లాడుతూ 135వ మేడే ఉత్సవాల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రై తన్న, వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తూ పె ట్టుబడి దారులకు అనుకూలంగా పరిపాలన కొనసాగిస్తూ ప్రజా వ్యతి రేక విధానాలను అవలంబిస్తుందన్నారు. ఇకనుంచి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేయాలని లేదంటే ఆందోళన కార్యక్రమాలు చే స్తామన్నారు. కార్యక్రమంలో గంగాధర్‌, బాలాజీ, భీమయ్య, రాజు, తె లంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యేశాల గంగాఽ దర్‌ ఆయా గ్రామాల కార్మికులు తదితరులున్నారు. 

బాల్కొండలో 

బాల్కొండ: ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల్కొం డలోని నడిమిగల్లీలో మేడే వారోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహిం చారు. 135ఏళ్ల క్రితం చికాగో నాగరంలో 8గంటల పనిదినాల కోసం పో రాడిన కార్మికుల నెత్తుటి నుంచి ఉద్భవించిన ఈ ఎర్రజెండా ప్రపంచ వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకతప్పలేదని ఐఎఫ్‌ టీయూ జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న అన్నారు. మోదీ ప్రభుత్వం 8గంటల పనిదినాల హక్కును 12గంటలకు పెంచి కార్మికులకు వ్యతిరేకంగా వ్య వహరిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయ కులు నజీర్‌, రాణి, రత్న, తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-05-03T05:19:10+05:30 IST