ఘనంగా భగీరథ జయంతి
ABN , First Publish Date - 2021-05-20T06:11:17+05:30 IST
నిజామాబాద్‌అర్బన్, మే 19: వైశాక శుద్ధ సప్తమి రోజున భగీరథ జయంతి సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆయన జయంతిని ఘనంగా నిర్వహించి ఆయనకు నివాళ్లు అర్పించారు.

నిజామాబాద్‌అర్బన్, మే 19: వైశాక శుద్ధ సప్తమి రోజున భగీరథ జయంతి సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆయన జయంతిని ఘనంగా నిర్వహించి ఆయనకు నివాళ్లు అర్పించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో భగీరథ జయంతిని కలెక్టర్ సీ.నారాయణరెడ్డి అధ్యక్షతన బీసీ సంక్షేమశాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు. కలెక్టర్ సీ.నారాయణరెడ్డి భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వళన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, బీసీ సంక్షేమశాఖ అధికారి రమేష్, కలెక్టరేట్ ఏవో సుదర్శన్, వివిధ సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
డిచ్‌పల్లిలో..
డిచ్‌పల్లి: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం డిచ్‌పల్లి తహసీల్ కార్యాలయంలో భగీరథ జయంతిని రెవెన్యూ ఉద్యోగులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్‌రావు భగీరథ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.