ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబీ

ABN , First Publish Date - 2021-10-20T05:11:28+05:30 IST

జిల్లాలో మంగళవారం మహ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలను మైనార్టీలు ఘనంగా నిర్వహించారు. స్థానిక దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. దీనిలో భాగంగా డిచ్‌పల్లిలో ద్విచక్ర వాహనా లపై

ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబీ
ఆర్మూర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ముస్ల్లిం మతపెద్దలు

జిల్లావ్యాప్తంగా మహ్మద్‌ ప్రవక్త జన్మదిన వేడుకలు
ముస్లిం సోదరుల భారీ ర్యాలీ
స్థానిక దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు

డిచ్‌పల్లి, అక్టోబరు 19: జిల్లాలో మంగళవారం మహ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలను మైనార్టీలు ఘనంగా నిర్వహించారు. స్థానిక దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలుచోట్ల  ర్యాలీలు నిర్వహించారు.  దీనిలో భాగంగా డిచ్‌పల్లిలో ద్విచక్ర వాహనా లపై జెండాలను చేతపట్టుకొని ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇస్లాంపూర దర్గా నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ నడి పల్లి, దేవనగర్‌, సుద్దపల్లి మీదుగా డిచ్‌పల్లి చేరుకుంది. చిన్నాపెద్ద తేడా లేకుండా ఈ వేడుకల్లో అందరూ పాల్గొన్నట్లు మైనార్టీ సోదరుల సంఘ ప్రతినిధి ఇనాయిత్‌ తెలిపారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు రాకుండా ఎస్సై ఆంజ నేయులు పోలీసు భద్రతతో వాహనాలను క్రమబద్ధీకరించారు.
ఇందల్‌వాయి: మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని  మండలకేంద్రంలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక మసీదులను ముస్తాబు చేసి అలంకరించారు. ర్యాలీ సందర్భంగా ప్రజలకు పానియాలను అందజేశారు.  
పెర్కిట్‌: మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్‌లో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. మహ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా  ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.  
రుద్రూరు: మండలంలో మంగళవారం మహ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రుద్రూరు, అక్బర్‌నగర్‌, సులేమాన్‌ ఫారం, రాయకూర్‌, తదితర గ్రామాలలో పెద్దఎత్తున ముస్లింలు ర్యాలీ నిర్వహించారు.  
నవీపేట: మండలంలో మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలను మైనారిటీలు ఘనంగా నిర్వహించారు. నవీపేటలోని సుభాష్‌నగర్‌ కాలనీ నుంచి ప్రధాన రహదారి మీదుగా జామ మసీద్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జామ మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  
రెంజల్‌(నవీపేట): రెంజల్‌ మండలంలో మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని రెంజల్‌, బోర్గాం, సాటాపూర్‌, కందకుర్తి, తదితర గ్రామాలలో యువకులు ర్యాలీ నిర్వహించారు.
కోటగిరి: కోటగిరి, పొతంగల్‌, ఎత్తొండ, హంగర్గ ఫారం, జల్లాపల్లితో పాటు ఆయా గ్రామాలలో మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలను నిర్వహించారు.  
బోధన్‌ రూరల్‌: పట్టణంలో మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలను మైనారిటీ లు ఘనంగా నిర్వహించారు. మసీద్‌లలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.
ఎడపల్లి: మండలంలో మహ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్‌- ఉన్‌-నబీ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. మసీద్‌లలో మత పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 

Updated Date - 2021-10-20T05:11:28+05:30 IST