బీటీ రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు

ABN , First Publish Date - 2021-01-14T04:22:51+05:30 IST

కామారెడ్డి నియోజ కవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణాలకు, మరమ్మతుల కు రూ.16.60 కోట్ల నిధులు మంజూరైనట్లు ప్ర భుత్వవిప్‌ గంపగోవర్ధన్‌ బుధవారం తెలిపారు.

బీటీ రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు

కామారెడ్డి, జనవరి 13: కామారెడ్డి నియోజ కవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణాలకు, మరమ్మతుల కు రూ.16.60 కోట్ల నిధులు మంజూరైనట్లు ప్ర భుత్వవిప్‌ గంపగోవర్ధన్‌ బుధవారం తెలిపారు. పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పె ట్టుకుని నాలుగు వరుసల రహదారి నిర్మాణం, భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పను లకు నిధులు కోరగా సీఎం కేసీఆర్‌, మంత్రి ప్రశాంత్‌రెడ్డి మంజూరు చేశారని తెలిపారు. భి క్కనూర్‌ పట్టణంలో నాలుగు వరుసల నిర్మాణం కోసం రూ.4కోట్లు, జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రో డ్డు అయ్యప్ప ఆలయం నుంచి రైల్వే బ్రిడ్జి వర కు నాలుగు వరుసల రహదారి, డివైడర్‌ నిర్మా ణం కోసం రూ.4 కోట్లు, దోమకోండ మండలం ముత్యంపేట రోడ్డుకు రెండు వరుసల రోడ్డు ని ర్మాణానికి రూ.2కోట్ల నిధులు మంజూరైనట్లు ప్ర భుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ తెలిపారు. కేకేవై రోడ్డు భవానిపేట నుంచి గజసింగవరం వయా ఎల్లం పేట రోడ్డుకు రూ.2కోట్లు, తలమడ్ల బీటీ రోడ్డు మరమ్మతులకు రూ.83లక్షలు, కేకేవై ప్యాచ్‌ వర్క్‌ పనులకు రూ.5లక్షలు, మందాపూర్‌ రోడ్డు మర మ్మతులకు నాలుగు లక్షలు, రాజంపేట మెదక్‌ జిల్లా సరిహద్దు వరకు బీటీ మరమ్మతుకు రూ.1.60కోట్లు మంజూరైనట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్‌ సమక్షంలో బీజేపీ, కాం గ్రెస్‌ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వా నించారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ముజిబోద్దిన్‌, ఎంపీపీ ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు లక్ష్మీనారా యణ, అంజల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దోమకొండ: మండలంలోని ముత్యంపేట గ్రా మ టీఆర్‌ఎస్‌ నాయకుడు లక్ష్మీనారాగౌడ్‌ కూతు రు ఉదయశ్రీ  మరణించింది. బుధవారం బాధి త కుటుంబాన్ని ప్రభుత్వవిప్‌ గంప గోవర్ధన్‌ ప రామర్శించారు. సోసైటీ మాజీ చైర్మన్‌ రమణారె డ్డి, సోసైటీ మాజీ చైర్మన్‌ తిరుపతిరెడ్డిలను కూ డా పరామర్శించారు. అనంతరం లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో బుధవారం స్వామివారి క ల్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్‌ పాల్గొని ప్ర త్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో  జ డ్పీవైస్‌ చైర్మన్‌ ప్రెమ్‌ కుమార్‌, జడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్‌, శేఖర్‌, ఐరేని నర్సయ్య, ఎంపీపీ కోట సదానంద, లలిత, నిరంజన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-14T04:22:51+05:30 IST