ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కే మొదటి ప్రాధాన్యత

ABN , First Publish Date - 2021-01-13T05:18:01+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉందని రాష్ట్ర రోడ్డు భవ నాల, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.

ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కే మొదటి ప్రాధాన్యత
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 17లక్షల మందికి  కో వ్యాక్సిన్‌
జిల్లాలో కరోనా ప్రభావం 22 శాతం నుంచి 0.34 శాతానికి తగ్గింది
కామారెడ్డి జిల్లాలో 12 వేల మందికి వ్యాక్సిన్‌, 30 కేంద్రాల ఏర్పాటు
రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

కామారెడ్డి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉందని రాష్ట్ర రోడ్డు భవ నాల, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో ఈ నెల 16 నుంచి నిర్వహించనున్న మొదటిదశ కరోనా వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కొవి డ్‌ వ్యాక్సినేషన్‌ మొదటి దశ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. గత పది నెలలుగా ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు శాస్త్రవేత్తలు చేసిన కృషి వల్ల వ్యాక్సిన్‌ వచ్చేసిందని మంత్రి  తెలిపారు. భారతప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఒకే గొడుగు కింద ఇంత పెద్ద కార్యక్రమం తలపెట్టిందని, దేశం మొత్తం మీద 3 కోట్ల మందికి మొదటిదశలో వ్యాక్సిన్‌ వేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17లక్షల మందికి మొదటిదశలో వేయనుండగా కామారెడ్డి జిల్లాలో 12వేల మం ది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు ఈ నెల 16 నుంచి నాలుగు రోజుల పాటు వ్యాక్సిన్‌ వేయడం జరుగుతుందని తెలిపారు. అందుకు అనుగుణంగా జిల్లాలో 30 సెంటర్లను వ్యాక్సినేషన్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 26 కోల్డ్‌ స్టోరేజీలలో వ్యాక్సిన్‌ను భద్రపరచడం జరుగుతుందని అన్నారు. భారత ప్రభుత్వంచే భారత్‌ బయోటిక్‌ కో వాక్సిన్‌, సీరం పూనా వ్యాక్సి న్‌ కోవిషిల్డ్‌ మందులు నిర్ధారించబడ్డాయని తెలిపారు. మొదటి నుంచి కామారెడ్డి జిల్లా కరోనా కట్టడిలో పకడ్బందీ చర్యలు చేపట్టిందని అందులో భాగంగానే 22 శాతం నుంచి 0.34 శాతా నికి కరోనా ప్రభావం తగ్గిందని అన్నారు. జిల్లా యంత్రాంగం చేసిన కృషి ఎనలేనిదన్నారు. వ్యాక్సిన్‌ వచ్చినందున శాస్త్రవేత్త లకు చేతులు జోడించి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపు తున్నామని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం మనమందరం మరో మారు కష్టపడదామని అన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రపంచం లో అసాధారణ కార్యక్రమమని, గతంలో ఇలాంటి విపత్తు రాలేదని అన్నారు. వ్యాక్సినేషన్‌ సెంటర్‌లలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోనేందుకు కిట్స్‌ అందుబాటులో ఉంటాయని, సమీపంలోని ఏరియా ఆసుపత్రికి టైఅప్‌ చేయడం, అంబులెన్స్‌ వాహన సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. వ్యాక్సినేష న్‌ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం చేసి వ్యాక్సి నేషన్‌పై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్గించడం జరుగు తుందని తెలిపారు. మొదటి డోసు వేయించుకున్న తర్వాత 28 రోజుల తర్వాత అదే సెంటర్‌లో రెండో డోసు వేయించుకోవాల ని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌కు కృషి చేసే అన్ని శాఖలు ఒక టీమ్‌ లాగా పని చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ శరత్‌ మాట్లాడుతూ వైద్య, పోలీసు, ఐసీడీఎస్‌, పారిశుధ్య, రెవె న్యూ శాఖల సమన్వయంతో కరోనా కట్టడికి ఒక ప్రణాళిక ప్రకా రం కృషి చేయడం, కరోనా శాతాన్ని తగ్గించడం జరిగిందని, వారంతా బాగా పని చేశారని అభినందించారు. కరోనా వ్యాక్సినే షన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, గ్రామ సర్పంచ్‌, పంచాయతీ సెక్రటరీ, మున్సిపల్‌ కమిషనర్‌, పోలీసు, రెవెన్యూశాఖ సమన్వయంతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వంద శాతం విజయవంతం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ దఫేదార్‌ శోభ, కలెక్టర్‌ శరత్‌, శాసన సభ్యులు హన్మంత్‌ షిండే, సురేందర్‌, ఎస్పీ శ్వేతారెడ్డి, అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, జిల్లా అసిస్టెం ట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌, ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌, డీసీహెచ్‌ఎస్‌ అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T05:18:01+05:30 IST