రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

ABN , First Publish Date - 2021-08-21T05:09:38+05:30 IST

మండలంలోని బస్వాపూర్‌ శివారులో 44వ జాతీ యరహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురికి స్పల్పగాయాలైనట్లు భిక్కనూరు ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

భిక్కనూరు, ఆగష్టు 20: మండలంలోని బస్వాపూర్‌ శివారులో 44వ జాతీ యరహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురికి స్పల్పగాయాలైనట్లు భిక్కనూరు ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు. వేల్పూర్‌ మండ లంలోని పైడిగల్‌ గ్రామానికి చెందిన గడ్డం నవీన్‌కుమార్‌, భార్య స్వప్న, కూతుళ్లు సాన్విక, అన్సికతో కలిసికారులో హైదరాబాద్‌ నుంచి తన గ్రామా నికి వెళుతున్నాడు. బస్వాపూర్‌ గ్రామ శివారులో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన గల కాలువలో ఇరుక్కుపోయింది. దింతో కారులో బెలూన్‌లు తెరుచు కోవడంతో ప్రమాదం తప్పింది. చికిత్స నిమిత్తం కామారెడ్డికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-08-21T05:09:38+05:30 IST