వైద్య విద్యార్థులకు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా మన్ననలు

ABN , First Publish Date - 2021-10-07T06:17:31+05:30 IST

వైద్య వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా విధులు నిర్వహించి దేశవ్యాప్తంగా మన్ననలు అందుకున్నారని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారం మెడికో విద్యార్థుల ఆటాపాటలతో ఫ్లాష్‌మబ్‌ ఘనంగా సాగింది.

వైద్య  విద్యార్థులకు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా మన్ననలు
ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో అవగాహన కల్పిస్తున్న మెడికోలు

అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ 

ఆటాపాటలతో మెడికోల అవగాహన 

ఆకట్టుకున్న ఫ్లాష్‌మబ్‌ కార్యక్రమం

పెద్దబజార్‌, అక్టోబరు 6: వైద్య వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా విధులు నిర్వహించి దేశవ్యాప్తంగా మన్ననలు అందుకున్నారని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారం మెడికో విద్యార్థుల ఆటాపాటలతో ఫ్లాష్‌మబ్‌ ఘనంగా సాగింది. జిల్లాకేంద్రంలోని ఎన్‌టీఆర్‌ చౌరస్తా వద్ద మెడికల్‌ కళాశాల ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆయట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్‌ కళాశాల విద్యార్థులు ప్రజలను చైతన్యవంతులని చేయడానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థినిలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో డీటీసీ వెంకటరమణ, ఏసీపీ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ ప్రతిమరాజ్‌, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఇందిర, వైద్యులు బాల్‌రాజ్‌, వెంకట్‌, హరిష్‌స్వామి, వైద్య, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-07T06:17:31+05:30 IST