నాగమడుగు ఎత్తిపోతలకు నిజాంసాగర్‌ నీళ్లే!

ABN , First Publish Date - 2021-03-29T06:22:42+05:30 IST

జిల్లా కేంద్రంలోని జ యశంకర్‌ కాలనీలో నివాసం ఉండే బ్యాంకు ఉ ద్యో గి చైతన్య ఇంటికి తాళం వేసి కరీంనగర్‌కు కు టుంబ సభ్యులతో వెళ్లాడు.

నాగమడుగు ఎత్తిపోతలకు  నిజాంసాగర్‌ నీళ్లే!
మంజీరా నదిలో నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మించనున్నది ఇక్కడే

పథక నిర్మాణ వ్యయం  రూ.476.25 కోట్లు

ఎత్తిపోతల పథక నీటి సామర్థ్యం 0.280 టీఎంసీలు

30 వేల 646 ఎకరాల ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యం

నిజాంసాగర్‌, పెద్ద కొడప్‌గల్‌, బిచ్కుంద, పిట్లం మండలాల్లోని 40 గ్రామాలకు సాగు నీరు

నిజాంసాగర్‌, మార్చి 28 : కామారెడ్డి జిల్లా జుక్కల్‌ ని యోజకవర్గంలో నాలుగు మండలాల్లో 30,646 ఎకరాలకు సా గునీరు అందించేందుకు నిర్మాణం చేపట్టనున్న నాగమడుగు ఎత్తిపోతల పథకానికి నిజాంసాగర్‌ నీరే వినియోగించ నున్నారు. ఈ పథక నిర్మాణం 476 కోట్ల 25 లక్షల రూపా యల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పథక నిర్మా ణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. శంకుస్థాపన సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా చేపట్టేందుకు ఉన్నతాధికారులు సన్నాహాలు చేపడుతున్నారు. ఈ పథకం నిర్మాణం 12 కిలో మీటర్ల పైప్‌లైన్‌ నిర్మాణం చేపట్టి నిజాంసాగర్‌, పిట్లం, పెద్ద కొడప్‌గల్‌, బిచ్కుంద మండలాల్లోని 30 వేల 646 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. మూడేళ్ల కిందట ఉన్నతస్థాయి అధికార యంత్రాంగం నాగమడుగు నిర్మాణానికి ప్రతిపాద నలు చేశారు. ఏడాది కిందట ప్రతిపాదన రూ.476 కోట్ల 25 లక్షలు మంజూరు చేయగా,  నీటి పారుదల శాఖ అధికారు లు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయగా, పనులను మెగా కన్‌ స్ట్రక్షన్‌కు పనులను అప్పగించారు. సీఎం కేసీఆర్‌ చేతుల మీ దుగా మల్లూర్‌ గ్రామ శివారులోని మంజీరా నది వద్ద నాగ మడుగు పథక నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. మంజీరా ఉప నదుల ద్వారా నాగమడుగు ఎత్తిపోతల పథకానికి వరద నీరు వచ్చి చేరి 0.280 టీఎంసీల నీటి సామర్థ్యానికి నిల్వ చేస్తూ మిగతా నీటిని మంజీరా నదిలోనికి నాగమడుగు ఎత్తిపోతల పథకం ద్వారా వదులుతుంటారు. యాసంగిలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు వరద నీళ్ల ద్వారా నాగమడుగు ఎత్తిపోతల పథకానికి అవసరమయ్యే నీటిని వదులుతుం టారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీరు వచ్చి చేర నున్నందున ఈ నీటిని ఎత్తిపోతల పథకానికి నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీరే వినియోగించనున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు 2 లక్షల 8 వేల ఎకరాలకు సాగునీరు అందిం చేందుకు నాగమడుగు ఎత్తిపోతల నీరే నిజాంసాగర్‌ ఆయ కట్టు మరో 30 వేల 646 ఎకరాలు పెరుగనున్నాయి. నిజాం సాగర్‌ ఆయకట్టు 2 లక్షల 38 వేల 646 ఎకరాలకు సాగు నీరు అందించే ప్రాజెక్టు అని చెప్పవచ్చు. నిజాంసాగర్‌ ప్రాజె క్టు దిగువన ఉన్న మంజీరా నది వెంట ఉన్న బాన్సువాడ, బీర్కూర్‌, కోటగిరి, మండలాలకు చెందిన రైతులకు మంజీరా నది ఒడ్డున ఉన్న భూములకు ఎత్తిపోతల పథకాల ద్వారానే నీటిని వినియోగిస్తుంటారు. కాళేశ్వరం నీటితో నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు నీళ్లు రానుండడంతో నిండు కుండలా ఉండ నుం దని, ఈ ప్రాజెక్టు ద్వారా నాగమడుగు ఎత్తిపోతల పథకానికి నిజాంసాగర్‌ ఆయకట్టు పూర్తిస్థాయిన వర్షాకాలం యాసం గికి నీరు వచ్చి ఉభయ జిల్లాల్లో సిరులు పండడమే కాకుండా వెనుక బడ్డ జుక్కల్‌ నియోకజవర్గంలోని నిజాంసాగర్‌ నాన్‌ కమాండ్‌ ఏరియా, పిట్లం, పెద్ద కొడప్‌గల్‌, బిచ్కుంద మండలాల్లోని 40 గ్రామాల సాగుభూముల్లో కూడా సిరులు పండనున్నాయి. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నైజాం కాలంలో నిర్మా ణం చేపట్టి అప్పట్లో 2 లక్షల 75 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు లక్ష్యంగా నిర్మాణం చేపట్టారు. కాల క్రమేణా మంజీరా వెంట వచ్చే నీటి ప్రవాహంతో ఇసుక మేటలతో నిజాంసాగర్‌ నీటి సామర్థ్యం 29 టీఎంసీల నుంచి 17 టీఎంసీలకు తగ్గింది. ప్రభుత్వాలు, పాలకులు నిర్లక్ష్య వైఖరి కారణంగానే నిజాంసాగర్‌ పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరం దకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన నీళ్లు మనకే అనే నినాదంతో గోదావరి జలాల నీటికి అడ్డంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నిజాంసాగర్‌కు వరద నీటిని తేనున్నారు. త్వరలో నిజాంసాగర్‌కు కాళేశ్వరం నీరు రానుండడంతో ఉభయ జిల్లాల రైతులు నాగమడుగు ఎత్తిపోతల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పథకం పనులు సకాలంలో పూర్తి చేస్తారని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-03-29T06:22:42+05:30 IST