ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2021-11-28T05:53:30+05:30 IST

భారత ప్రభుత్వం, భారత ఆహారసంస్థ యాసంగి సాగు చేసిన వరి పంటను కొనుగోలు చేయదని స్పష్టం చేసిందని, యాసంగి వరిసాగు నుంచి వచ్చిన బియ్యం కొనుగోలు చేయదని, అందుకు రైతులు ఆరుతడి పంటలపై దృష్టిపెట్టాలని చీఫ్‌ సెక్రెటరీ సోమేష్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. శ

ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి


నిజామాబాద్‌అర్బన్‌, నవంబరు 27:
భారత ప్రభుత్వం, భారత ఆహారసంస్థ యాసంగి సాగు చేసిన వరి పంటను కొనుగోలు చేయదని స్పష్టం చేసిందని, యాసంగి వరిసాగు నుంచి వచ్చిన బియ్యం కొనుగోలు చేయదని, అందుకు రైతులు ఆరుతడి పంటలపై దృష్టిపెట్టాలని చీఫ్‌ సెక్రెటరీ సోమేష్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యాసంగిలో వరి పంట వేస్తే నూకలు ఎక్కువరావడానికి అవకాశం ఉండడంతో పాటు అధిక ఉష్ణోగ్రత వల్ల తెలంగాణ రైతులకు నష్టం జరుగుతుందని వారు తెలిపారు. అందుకు యాసంగిలో వరిపంటకు బదులు ఆరుతడి పంటల సాగు ప్రోత్సహించాలన్నారు. రైతు వేదికల ద్వారా వ్యవసాయశాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రమిశ్రా, సీపీ కార్తికేయ, వ్యవసాయ అధికారి గోవింద్‌, సింహాచలం, వెంకటేశ్వర్లు, అభిషేక్‌, పాల్గొన్నారు.


Updated Date - 2021-11-28T05:53:30+05:30 IST