అచ్చయపల్లిలో ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-05-21T04:55:23+05:30 IST

మండలంలోని అచ్చయ పల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకుని అరెస్టు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

అచ్చయపల్లిలో ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

నాగిరెడ్డి పేట, మే 20: మండలంలోని అచ్చయ పల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకుని అరెస్టు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా అచ్చ య్య పల్లి గ్రామ శివారులోని రహస్య ప్రాంతంలో రాత్రివేళ కొందరు పేకాట రాయుళ్లు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పేకాట స్థావరం పై దాడి చేసినట్లు తెలిపారు. పేకాట ఆడుతున్న అచ్చయ్య పల్లి, పెద్దా రెడ్డి గ్రామాలకు చెందిన భిక్షపతి, నాయకోటి రాములు, బెస్త రవీందర్‌, బెస్త సాయిలు, బెస్త అంజయ్యలను పట్టుకున్నట్లు తెలిపారు. ఐదుగురి వద్ద నుం చి రూ.6 వేలు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు, గేమింగ్‌ యాక్టు, లాక్‌ డౌన్‌ నిబంధనల ఉల్లంఘన చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టుకు పంపించినట్లు తెలిపారు. గ్రామాల్లో పేకాట ఆడుతుంటే సమాచారం అందించాలని, పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-05-21T04:55:23+05:30 IST