నాణ్యత లేని రొయ్య పిల్లలను అడ్డుకున్న మత్స్య కార్మికులు

ABN , First Publish Date - 2021-02-06T05:17:31+05:30 IST

మత్స్యశాఖ ఉద్ధరణ కోసం వందశాతం రాయితీ పై ప్రాజెక్టుల్లో రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొంది ంచారు.

నాణ్యత లేని రొయ్య పిల్లలను అడ్డుకున్న మత్స్య కార్మికులు
బకెట్‌లో తెచ్చిన రొయ్య పిల్లలను పరిశీలిస్తున్న డీడీ సుజాత

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 5: మత్స్యశాఖ ఉద్ధరణ కోసం వందశాతం రాయితీ పై ప్రాజెక్టుల్లో రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొంది ంచారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో నిజాంసాగర్‌లో 30 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టులో ఇప్పటి వరకు 24లక్షల 59వేల నీలకంఠ రొయ్య పిల్లలను విడుదల చేశారు. మిగతా 5లక్షల 50వేల రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు శుక్రవారం సప్లయ్‌దా రుడు 5 వ్యాన్లలో నిజాంసాగర్‌కు తీసుకుని వచ్చారు. మత్స్య కమిషనర్‌ కార్యాలయం నుంచి డిప్యూటీ డైరెక్టర్‌ సుజాత పర్యవేక్షణలో విడుదల చేసేం దుకు ఏర్పాట్లు చేశారు. రొయ్య పిల్లలను లెక్కిస్తుండగా, రొయ్యలతో పాటు లోకల్‌ సీడ్‌ కలిపి తీసుకుని రావడంతో రెండు వ్యాన్‌ల సీడ్‌లను లెక్కించి చూడగా, వ్యాన్‌లలో రొయ్య పిల్లల నీలకంఠ శాతం 30శాతం కలిగి ఉండటం తో అధికారులు సప్లయ్‌దారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విడుదల కార్యక్ర మానికి వచ్చిన మత్స్య కార్మికులు రొయ్య పిల్లల సీడ్‌ నాసిరకంగా ఉందని, నిజాంసాగర్‌లో ఈ సీడ్‌ పెరగదని తేల్చి చెప్పారు. సీడ్‌ విడుదలను పర్యవేక్షి ంచడానికి వచ్చిన డిప్యూటీ డైరెక్టర్‌ సుజాత ఈ సీడ్‌ను నిజాంసాగర్‌లో విడు దల చేసేది లేదని వెనక్కి పంపారు. ఈ ఏడాది నిజాంసాగర్‌లో రెండో విడత 94వేల 240 చేప పిల్లలను ఇదే సప్లయ్‌దారుడు సప్లయ్‌ చేయగా, అప్పట్లో అధికారులు లక్ష చేప పిల్లలను విడుదల చేశారు. ఇదే మొదట్లో సప్లయ్‌ చేసి న సప్లయ్‌దారుడే మరో 5 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు తీసుకుని రావడంతో ఈ చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని అధికారులు ధ్రువీకరించారు. రొయ్య పిల్లలను 5 వ్యాన్‌లలో తీసుకుని వచ్చిన సప్లయ్‌దా రుడు వెనక్కి తీసుకెళ్లారు. ఇతను తెలంగాణలోని అన్ని జిల్లాల్లో టెండర్లు పలికి నాసిరకం రొయ్య పిల్లలను తీసుకుని వస్తూ జలాశయాల్లో వదులు తున్నప్పటికీ మత్స్యశాఖ అధికార యంత్రాంగం వత్తాసు పలుకుతున్నారని విమర్శలు వస్తున్నాయి. 2019-2020లో కూడా నాణ్యత లేని రొయ్య పిల్లలను విడుదల చేయడంతో అప్పట్లో మత్స్యకారులు ఆందోళన చేయడంతో కేవలం 90వేల రొయ్య పిల్లలను విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. అప్పట్లో ప్రణాళిక ప్రకారంగా రొయ్య పిల్లలను విడుదల చేయకపోవడం గమనార్హం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయాల్సిన 18 లక్షలకు గాను కేవ లం 90వేలే విడుదల చేసి మత్స్యశాఖ అధికార యంత్రాంగం చేతులు దులు పుకున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ జిల్లాల్లోని జలాశయాల్లో కైకలూరు కు చెందిన ఓ సీడ్‌ ఫాం కాంట్రాక్టర్‌ ఇలా నాసిరకం రొయ్య పిల్లలను సప్లయ్‌ చేయడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై డిప్యూటీ డైరెక్టర్‌ సుజాతను వివరణ కోరగా, ప్రస్తుతం 5 లక్షల నీలకంఠ రొయ్య పిల్లల సీడ్‌లో 30శాతం నీలకంఠ రొయ్య పిల్లలు ఉండటంతో నాసిరక ంగా గుర్తించి వెనక్కి పంపినట్లు సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారిణి మధుసూదన్‌, ఎఫ్‌డీవో డోల్‌సింగ్‌, నిజాంసాగర్‌ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యక్షుడు బోయి రాములు, మత్స్య కార్మికులున్నారు.

Updated Date - 2021-02-06T05:17:31+05:30 IST