చౌట్‌పల్లిలో ముగిసిన ట్రెయినీ ఐఏఎస్‌ల క్షేత్రపర్యటన

ABN , First Publish Date - 2021-03-22T05:41:49+05:30 IST

మండలంలోని చౌట్‌పల్లి గ్రామంలో ట్రెయినీ ఐఏఎస్‌ అధికారుల ఐదు రోజుల క్షేత్రపర్యటన ఆదివారం ముగిసింది. దీంతో ఆదివారం వారు జిల్లా కేంద్రానికి బయలుదేరి వెళ్లారు.

చౌట్‌పల్లిలో ముగిసిన ట్రెయినీ ఐఏఎస్‌ల క్షేత్రపర్యటన
ట్రెయినీ ఐఏఎస్‌ అధికారులకు వీడ్కోలు పలుకుతున్న చౌట్‌పల్లి గ్రామస్థులు

కమ్మర్‌పల్లి, మార్చి 21: మండలంలోని చౌట్‌పల్లి గ్రామంలో ట్రెయినీ ఐఏఎస్‌ అధికారుల ఐదు రోజుల క్షేత్రపర్యటన ఆదివారం ముగిసింది. దీంతో ఆదివారం వారు జిల్లా కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. కాగా, గ్రామానికి వచ్చిన ట్రెయినీ ఐఏఎస్‌ అధికారులు అవుల సాయి కృష్ణ, సామేసింగ్‌ మీన, రౌత్‌ గౌరవ్‌ కిషోర్‌, చైమన్‌కర్‌ విశ్వజీత్‌ గజానన్‌లకు గ్రామ సర్పంచ్‌ మారు శంకర్‌ ఆధ్వర్యంలో గ్రామస్థులు మేళతాళాలు మంగళవాయిద్యాలతో ఘనంగా వీడ్కో లు పలికారు. అంతకుముందు అధికారులను ఘనంగా సన్మానించి వారికి జ్ఞాపికలను అంద జేశారు. శిక్షణలో భాగంగా చౌట్‌పల్లికి వచ్చిన బృందం సభ్యులకు గ్రామస్థులు, గ్రామ సర్పం చ్‌, పంచాయతీ పాలకవర్గం పూర్తి సహకారం అందించారని అధికారులు తెలిపారు. చిన్నగ్రా మమైనా పట్టణస్థాయిలో అభివృద్ధి జరిగిందన్నారు. గ్రామస్థులు ఐక్యంగా మరిన్ని అభివృద్ధి పనులు సంపాదించుకోవాలని సూంచారు. వీడ్కోలు కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్‌రెడ్డి,  హెచ్‌ఎం గంగాధర్‌, కార్యదర్శులు గంగజమున, చిట్యాల ప్రభాకర్‌, దామోదర్‌ పాల్గొన్నారు.  

క్షేత్రస్థాయి పర్యటనతోనే అన్ని విషయాలు తెలుస్తాయి : అదనపు కలెక్టర్‌

నిజామాబాద్‌అర్బన్‌: క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యలు తెలుస్తాయని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. వారం రోజుల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించిన సివిల్‌ సర్వీస్‌ శిక్షణ అధికారులకు ఆదివారం స్థానిక హోటల్‌లో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై మాట్లాడితే అనేక విషయాల్లో మంచి అవుట్‌ఫుట్‌ దొరుకుతుందన్నారు. అదే విధంగా మంచి అనుభవం లభిస్తుందన్నారు. శిక్షణ అధికారులు తమ పర్యటన లో పరిశీలించిన చాలా విషయాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపాల్‌ కమిషనర్‌ జితేష్‌వి.పాటిల్‌, ఆర్డీవో రవి, తహసీల్దార్‌ చాంద్‌పాషా, ఆర్‌సీఎం ఆంజనేయులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-22T05:41:49+05:30 IST