అకాల భయం

ABN , First Publish Date - 2021-05-02T06:16:56+05:30 IST

జిల్లా రైతులను అకా ల వర్షాలు భయపెడుతున్నాయి. ఆకాశమంతా కారుమ బ్బులు కమ్మేయడంతో రైతులు ఆగమాగం అవుతున్నారు.

అకాల భయం
పిట్లంలో తడిసిన ధాన్యం

రైతులను ఆగం చేస్తున్న వడగండ్ల వర్షాలు       
జిల్లాలో 30 శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు
70 శాతం కొనుగోలు కేంద్రాలు, పంట పొలాల్లోనే..
జిల్లాను కమ్మేసిన కారు మబ్బులు
కొన్ని మండలాల్లో వడగండ్ల వర్షాలు             

చేతికి వచ్చిన పంట ఏమవుతుందోనని రైతుల్లో ఆందోళన
కామారెడ్డి, మే 1(ఆంధ్రజ్యోతి): జిల్లా రైతులను అకా ల వర్షాలు భయపెడుతున్నాయి. ఆకాశమంతా కారుమ బ్బులు కమ్మేయడంతో రైతులు ఆగమాగం అవుతున్నారు. కేంద్రాల్లోని వరి ధాన్యం పంట పోలాల్లోని వరిని కాపా డుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు 30శాతం వరకే జరి గాయి. ఇప్పుడిప్పుడే రైతులు భారీగా ధాన్యాన్ని కేంద్రా లకు తరలిస్తున్నారు. కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో ధా న్యం కొనుగోలు జరగకపోవడంతో అకాల వర్షాలకు ఎక్క డ తడిసిపోతాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని వెనువెంటే కొను గోలు చేసి తరలించాలంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నా రు. జిల్లాలో ఇప్పటి వరకు 282 కేంద్రాలలో లక్ష మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసినట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆకాశాన్ని కమ్మేస్తున్న మబ్బులు
ప్రతీ యాసంగి సీజన్‌లో అకాల, వడగండ్ల వర్షం కురువడం సాధారణమే. సరిగ్గా కోతల సమయంలోనే కురుస్తుండడంతో ప్రతీయేట ధాన్యం తడిసిపోతుండ డంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల వాతా వరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు ఆకాశాన్ని కారుమబ్బులు కమ్మేస్తుండడంతో రైతులు ఆందోళన చెం దుతున్నారు. రెండు రోజుల నుంచి జిల్లాలో అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాలు, పంట పొలాల్లోనే ధాన్యం తడిసిపోతోంది. బాన్సువాడ, జుక్కల్‌, బిచ్కుంద తదితర మండలాల్లో కురుసిన అకాల వర్షాలు, వడగండ్లతో పంటలు దెబ్బతినడమే కాకుండా కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. వడగండ్ల వర్షాల తాకిడికి వడ్లు రాలిపోయి నేల పాలయ్యాయి.
జిల్లాపై వడగండ్ల వర్షం
జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు ఇప్పుడిప్పుడే దండిగా ధాన్యం వస్తోంది. మరికొన్ని చోట్ల వేలాది ఎకరాల్లో వరి కోతలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వడగండ్ల వర్షాలు రైతులను భయపెడుతున్నాయి. గత 10 రోజుల కిందటే నాగిరెడ్డిపేట, లింగంపేట, బీర్కూర్‌, బాన్సువాడ, నిజాం సాగర్‌, ఎల్లారెడ్డి తదితర మండలాల్లో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వేలాది క్వింటాళ్ల ధాన్యం తడువగా వరి పంట నేలకు ఒరిగింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటుండడం, చల్లపడడం, ఆకాశం మబ్బుల తో కమ్మేయడంతో ఎక్కడ అకాల వర్షాలు కురుస్తాయో నని రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం, శని వారం జిల్లాలో పలుచోట్ల అకాల వర్షాలు, ఇదురుగాలుల తో కూడిన అకాల వర్షం కురువడంతో రైతులు ఆందోళన కు గురవుతున్నారు.
పరుగులు తీస్తున్న రైతులు
జిల్లాలో వాతావరణం ఉన్నట్టుండి మారిపోవడంతో కేంద్రాల్లోని ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పరు గులు తీస్తున్నారు. కోతకు వచ్చిన పొలాలు గాలిదుమా రానికి, వర్షానికి అడ్డం పడుతాయని రాశులుగా ఉన్న ధాన్యం తడిస్తుందేమోనని ఆవేదన చెందుతు న్నారు. ఎప్పుడు ఏ గాలి దుమారం వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంటను కోసి కల్లాలు, కేంద్రాల్లో ఆరబెట్టుకున్న రైతులు కుప్పలు గా పోసి పట్టాలు పట్టుకునేందుకు ఉరుకులు పరుగు లు పెడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సరిప డా టార్పాలిన్‌లు అందుబాటులో లేకపోవడంతో తెలిసిన వారి వద్ద కొనుగోలు చేసి ధాన్యం రాశులపై కప్పుకుంటు న్నారు.
లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు
జిల్లాలో ఇప్పుడిప్పుడే ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుం టున్నాయి. రైతులు సైతం ధాన్యాన్ని కేంద్రాలకు తరలిస్తు న్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 30 శాతం మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. ఇంకా 70 శాతం కేంద్రాల వద్దనే ఉన్నాయి. ఈ యాసంగి సీజన్‌లో నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు అధికారులు లక్ష్యం గా పెట్టుకోగా 342 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణ యించారు. అయితే  ఇప్పటి వరకు 316 కేంద్రాలను ప్రారంభించగా 282 కేంద్రాల్లో లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రూ.191కోట్లతో 17,500 మంది రైతుల నుంచి కొనుగోలు చేపట్టారు. ఇందులో 11 వేల మంది రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇప్పటి వరకు 7వేల మంది రైతుల ఖాతాలో రూ.81 కోట్లు ధాన్యం డబ్బులను జమ చేశారు. అయితే ఈ సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు తరలించేందుకు కాస్తా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ యాసంగి సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని 37 రైస్‌మిల్లులకు కేటాయించారు. ఈ రైస్‌మిల్లులోని ఎక్కువ మిల్లులు కామారెడ్డి డివిజన్‌ ప్రాంతంలో ఉండడంతో బాన్సువాడ, జుక్కల్‌, ఎల్లారెడ్డి డివిజన్‌ ప్రాంతాల నుంచి కామారెడ్డికి తరలించేందుకు కాస్తా ట్రాన్స్‌పోర్టు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కలెక్టర్‌ ఆదేశాలతో సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
బాన్సువాడ డివిజన్‌లో ఉరుములతో కూడిన భారీ వర్షం
బాన్సువాడ/బాన్సువాడ టౌన్‌, బిచ్కుంద/మద్నూర్‌/బీర్కూర్‌/నస్రుల్లాబాద్‌, మే 1: బాన్సువాడ డివిజన్‌లో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకున్నాయి. ఉరుములు మెరుపులతో కడిన వర్షం కురియడంతో వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. బాన్సువాడ డివిజన్‌లోని మద్నూర్‌, జుక్కల్‌, పిట్లం, పెద్ద కొడప్‌గల్‌, నిజాంసాగర్‌, బిచ్కుంద, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, బాన్సువాడ మండలాల్లోని ఆయా శివారు గ్రామాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. అలాగే వరి పంట తడిసి పోగా, కొన్ని చోట్ల వరి ధాన్యం కిందకు రాలిపోయింది. చేతికొచ్చిన పంట మరికొన్ని రోజుల్లో ఇంటికి వస్తుందనుకున్న తరుణంలో అకాల వర్షం నిండా ముంచిందని రైత న్నలు ఆందోళన చెందుతున్నారు. మద్నూర్‌ మండలంలోని ఎన్బూరా కొనుగోలు కేంద్ర ంలో ధాన్యాన్ని సొసైటీ వారు త్వరగా తీసుకోకపోవడం వల్లే నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంట వెంటనే లోడింగ్‌ చేసిన ధాన్యం తీసుకెళ్లాల్సి ఉన్నా అధికారులు స్పందించకపోవడంతోనే రైతులు నష్టపోయారన్నాని సర్పంచ్‌ ఆరోపి ంచారు. బీర్కూర్‌ మండల వ్యాప్తంగా శనివారం బలమైన ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడి సి ముద్దయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నత్తనడకన నడుస్తుండటంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఆయా గ్రామాల్లో ఇం కా వరి పంట కోయాల్సి ఉంది. ఈదురు గాలులు వడగండ్ల వర్షం కారణంగా వరి ధాన్యం పంట రాలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అధికారులు
బాన్సువాడ మండలంలోని ఆయా శివారు గ్రామాల్లో వరి పంటను ప్రజా ప్రతినిధు లు, అధికారులు శనివారం పరిశీలించారు. బిచ్కుంద మండలం మాన్యపూర్‌లో శనివా రం దెబ్బతిన్న పంటలను ఆర్‌ఐ సాయిబాబా, వ్యవసాయధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం రాత్రి గాలులతో కూడిన వడగాళ్ల వానకు 250 ఎకరాల్లో వరి పంట నేలవాలి నష్టం వాటిల్లిందన్నారు. దెబ్బతిన్న వరి పంట నివే దికను ఉన్నతాధికారులకు తెలియజేసి రైతులకు పరిహారం అందేవిధంగా చూస్తామ న్నారు.

Updated Date - 2021-05-02T06:16:56+05:30 IST