బ్యాంకుల ఎదుట రైతుల బారులు

ABN , First Publish Date - 2021-05-18T06:29:06+05:30 IST

మండలంలో ధాన్యం విక్రయించిన రైతులు డబ్బుల కోసం బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. మండల కేంద్రంలోని ఎన్‌డీసీసీబ్యాంకు వద్ద సోమవారం డబ్బు

బ్యాంకుల ఎదుట రైతుల బారులు
లింగంపేట ఎన్‌డీసీసీ బ్యాంకు వద్ద బారులు తీరిన రైతులు



లింగంపేట, మే 17: మండలంలో ధాన్యం విక్రయించిన రైతులు డబ్బుల కోసం బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. మండల కేంద్రంలోని ఎన్‌డీసీసీబ్యాంకు వద్ద సోమవారం డబ్బుల కోసం రైతులు బారులు తీరారు. ఒకరిని ఒకరు తోసుకుంటు ఘర్షణ పడడంతో పోలీసులు వచ్చి క్యూ లైన్‌ ఏర్పాటు చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్ర యించేందుకు కొనుగోలు కేంద్రాలలో రోజుల తరబడి నిరీక్షించి విక్రయిస్తే చివరికి రైస్‌మిల్లర్లు తరుగుపేరుతో ఇబ్బందులు, అన్ని సవ్యంగా జరిగి డబ్బు లు బ్యాంకులో జమ చేసిన తరువాత బ్యాంకుల చుట్టు తిరగాల్సి వస్తోంది. స్తుంది. రైతులకు చెల్లించేందుకు బ్యాంకుల వద్ద సరిపడా డబ్బులు లేకపోవడంతో కొంత మొత్తాన్ని పలు దఫాలుగా తీసుకోవల్సి వస్తుందని రైతులు అంటున్నారు. ఒకవైపు కొవిడ్‌, మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా బ్యాంకులు పూర్తి సమయం పనిచేయడం లేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. డబ్బుల కోసం బ్యాంకు వద్ద గుంపులు గుంపులుగా ఉండ డం టతో అందులో ఎవరికైనా కరోనా ఉంటే రైతులందరికి వచ్చే ప్రమాదం ఉంది. బ్యాంకులలో రైతుల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి చెల్లించల్సిన డబ్బులను ఒకేసారి చెల్లించాలని అన్నదాతలు కోరుతున్నారు.  

Updated Date - 2021-05-18T06:29:06+05:30 IST