పొలంలో గుండెపోటుతో రైతు మృతి

ABN , First Publish Date - 2021-08-21T05:32:56+05:30 IST

మండలకేంద్రంలో శుక్రవారం పొలంలో మందు చల్లుతూ గుండెపోటుతో తీగెల పెద్ద బాల్‌రెడ్డి(47) అనే రైతు మరణించి నట్టు గ్రామస్థులు తెలిపారు. మృతుడు బాల్‌రెడ్డి ఎప్పటి మాదిరిగానే తన పొలానికి మందు

పొలంలో గుండెపోటుతో రైతు మృతి

వేల్పూర్‌, ఆగస్టు 20: మండలకేంద్రంలో శుక్రవారం పొలంలో మందు చల్లుతూ గుండెపోటుతో తీగెల పెద్ద బాల్‌రెడ్డి(47) అనే రైతు మరణించి నట్టు గ్రామస్థులు తెలిపారు. మృతుడు బాల్‌రెడ్డి ఎప్పటి మాదిరిగానే తన పొలానికి మందు చల్లడానికి వెళ్లి.. ఇదేక్రమంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయి ఉండడాన్ని స్థానికులు గమనించారు. దీంతో పక్కనే పొలంలో ఉన్న రైతులు బాల్‌రెడ్డి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కుటుంబీ కులు పొలం వద్దకు వెళ్లి బాల్‌రెడ్డిని పొలంలో నుంచి బయటకు తీసుకువస్తుండగానే తుదిశ్వాస విడిచాడని వారు పేర్కొన్నారు. కాగా, మృతుడు బాల్‌ రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Updated Date - 2021-08-21T05:32:56+05:30 IST