విద్యుదాఘాతంతో రైతు మృతి
ABN , First Publish Date - 2021-09-03T05:43:22+05:30 IST
మండలంలోని కొత్త కొరుట్లతండాకు చెం దిన బుక్యా లచ్చిరాం (35) అనే రైతు తన పొలానికి నీరు పెట్టేందుకు వె ళ్లి ప్రమాదవశాత్తు మోటారు వద్ద విద్యుత్‌షాక్ తగిలి మృతిచెందినట్లు ఎస్సై గౌరీందర్‌గౌడ్ తెలిపారు.

ఇందల్‌వాయి, సెప్టెంబరు 2: మండలంలోని కొత్త కొరుట్లతండాకు చెం దిన బుక్యా లచ్చిరాం (35) అనే రైతు తన పొలానికి నీరు పెట్టేందుకు వె ళ్లి ప్రమాదవశాత్తు మోటారు వద్ద విద్యుత్‌షాక్ తగిలి మృతిచెందినట్లు ఎస్సై గౌరీందర్‌గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మూ డు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో పంట పొలంలో మో టారు ఆఫ్ చేసి ఉంది. మోటారు ఆన్‌చేసేందుకు వెళ్లిన రైతు లచ్చిరాం కరెంట్ డబ్బా వద్ద షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. లచ్చిరాంకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.