అన్నదాత చూపు ఎర్రజొన్న వైపు!

ABN , First Publish Date - 2021-10-08T05:21:26+05:30 IST

జిల్లాలో రాబోయే యాసంగిలో ఎర్రజొన్న సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. గ్రామాలవారీగా విత్తన కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.

అన్నదాత చూపు ఎర్రజొన్న వైపు!

జిల్లాలో యాసంగిలో పెరగనున్న ఎర్రజొన్న సాగు

గ్రామాలలో ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంటున్న వ్యాపారులు, రైతులు

పర్యవేక్షిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు

ఒప్పందం చేసుకున్నాకే విత్తనాలు తీసుకోవాలని ఏఈవోల సూచన 

జిల్లాలోని ఆర్మూర్‌ డివిజన్‌లో 40 ఏళ్లుగా కొనసాగుతున్న ఎర్రజొన్న సాగు

40 వేల ఎకరాల నుంచి 50 వేల ఎకరాల మధ్య సాగవుతున్న పంట

 30 ఏళ్లుగా ఈ ప్రాంతంలోనే విత్తనోత్పత్తి

నిజామాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో రాబోయే యాసంగిలో ఎర్రజొన్న సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. గ్రామాలవారీగా విత్తన కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ దఫా పంటను పెద్దఎత్తున సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత సం వత్సరం ధర భారీగా రావడంతో ఈ యాసంగిలో మరింత ఎక్కువ విస్తీర్ణంలో పంటను వేసేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. విత్తన కంపెనీల యజమానులు సిండికే ట్‌ అయి ధర తక్కువ చెబుతున్నా.. పంట చేతికివచ్చే సమయంలో నచ్చిన వ్యాపారికి అమ్ముకునే అవకాశం ఉండ డంతో పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రభు త్వం వరిని తగ్గించి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించడంతో రైతులు ఎర్రజొన్నను ఎక్కువ మొత్తంలో సాగుచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

జిల్లాలో 40 ఏళ్లుగా ఎర్రజొన్న సాగు

జిల్లాలోని ఆర్మూర్‌ డివిజన్‌లో గడిచిన 40 ఏళ్లుగా రైతు లు ఎర్రజొన్న పంటను సాగు చేస్తున్నారు. సుమారు 20 మండలాల పరిధిలో ప్రతీ సంవత్సరం యాసంగిలో రైతు లు ఈ పంటను వేస్తున్నారు. సుమారు 40వేల నుంచి 50 వేల ఎకరాల మధ్య ఈ పంట సాగు చేస్తున్నారు. రాష్ట్రం లో కేవలం ఆర్మూర్‌ డివిజన్‌లోనే ఈ పంటను ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఎర్రజొన్న పంటకు ఉత్తరాదిన డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో రైతులు ధర తగ్గినా.. పెరిగినా.. ప్ర తీ సంవత్సరం ఎర్రజొన్న సాగును మాత్రం వదలడంలే దు. ఆర్మూర్‌ డివిజన్‌లోని సుమారు 185 గ్రామాల్లో ఈ పంటను సాగుచేస్తున్నారు. జిల్లాతోపాటు నిర్మల్‌, జగిత్యాల జిల్లాల్లో కొంత మొత్తంలో పంట సాగవుతోంది.

ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగం 

ఎర్రజొన్న పంటను ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ఢిల్లీ, పంజా బ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో పశువుల దాణాగా వినియోగిస్తారు. ఇక్కడ పండించిన ఎర్రజొన్నలను అక్కడి చేళ్లలో వేసి పశువుల గ్రాసంగా వేస్తారు. ప్రతీ సంవత్సరం ఇక్కడి నుంచే ఆ రాష్ట్రాలకు విత్తనాలు సరఫరా అవుతాయి. దేశంలో నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల జిల్లాలతో పాటు కర్ణాటకలోని బల్లారిలో మాత్రమే ఈ పంటను సా గుచేస్తా రు. ఎర్రజొన్న గడ్డి విత్తనం కావడంతో ఈ పంటకు మద్ద తు ధర లేదు. ప్రతీ సంవత్సరం వ్యాపారులు పెట్టిందే ధర గా వస్తోంది. రైతులు.. వ్యాపారులు నిర్ణయించిన ధరకే వి క్రయిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు కొంత బంగ్లాదే శ్‌, పాకిస్థాన్‌కు కూడా సరఫరా చేస్తున్నారు.

వంద ఎకరాలతో  మొదలు..

జిల్లాలో 40 ఏళ్ల క్రితం ఆర్మూర్‌ ప్రాంతంలో మొదలైన ఈ పంట క్రమంగా డివిజన్‌ పరిధిలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. మొదట వంద ఎకరాలతో మొదలై ప్రస్తుతం 50వేల ఎకరాల వరకు సా గవుతోంది. మొదట ఉత్తరాది రాష్ట్రాల నుంచే సీడ్‌ను తె చ్చుకున్న రైతులు.. 30 ఏ ళ్లుగా ఈ ప్రాంతంలోనే వి త్తనోత్పత్తి చేస్తున్నారు. ఇ క్కడ ఉత్పత్తి  చేసిన విత్తనాలను సీజన్‌లో రైతులకు ఇచ్చి పంట సాగు వేసేవిధం గా చూస్తున్నారు. మళ్లీ అదే కం పెనీల యజమానులు కొనుగోలు చేసి ఉత్తరాది రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఎర్రజొన్న సాగులో ప్రతీ సంవత్సరం కంపెనీ యజమానులదే పైచేయిగా ఉంటోంది. వారు పెట్టి ందే ధరగా మారుతోంది. ఆర్మూర్‌ ప్రాంతంలో అంకాపూర్‌ తో కలిపి సుమారు 45 వరకు కంపెనీలు ఉన్నాయి. వీరే గ్రామాలలో ఆర్గనైజర్‌లను పెట్టుకుని ఈ పంట సాగయ్యేవిధంగా చూస్తున్నారు. ప్రతీ సంవత్సరం యాసంగిలో వి త్తనం ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఎర్రజొన్న సాగు పెరిగి నా మద్దతు ధర లేకపోవడం వల్ల ప్రతీ సంవత్సరం రైతు లు మద్దత ధర కోసం ఆందోళన బాట పడుతున్నారు. ఈ ఆందోళనలు కొన్నిసార్లు ఘర్షణలకు కూడా దారి తీస్తున్నాయి. ఓ దఫా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఎర్రజొన్నకు మద్దత ధర కల్పించాలని రైతులు ఆందోళన చేయగా వారిపై కాల్పులు కూడా జరిగాయి. 

సాగును నియంత్రించిన ప్రభుత్వం

జిల్లాలో ప్రతీ సంవత్సరం అక్టోబరు నెలలో ఎర్రజొన్న సాగును మొదలుపెడతారు. గ్రామాల వారీగా రైతు సం ఘాల ఆధ్వర్యంలో ఒప్పందాలు చేసుకుని విత్తనాలు సరఫ రా చేస్తారు. అయితే, జిల్లాలో 2008లో గొడవ జరిగినప్పటి నుంచి ప్రభుత్వం కూడా ఈ సాగుపై దృష్టిపెట్టింది. కొన్ని సంవత్సరాల పాటు పంట సాగును నియంత్రించింది. రై తులు తప్పనిసరిగా కంపెనీలతో ఒప్పందం చేసుకుని సా గు చేసేవిధంగావ్యవసాయశాఖ అధికారులు చూస్తున్నా రు. ఒప్పంద పత్రాల ఆధారంగా రైతులు పంట పండించి న విత్తన కంపెనీల యజమానులు పంటను కొనుగోలు చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. డిమాండ్‌ లేనపుడు వ్యాపారులు కొనేందుకు వెనకడుగు వేస్తే రైతుల ఆందోళన లు లా అండ్‌ ఆర్డర్‌ సమస్యగా మారుతుండడంతో ఈ ని ర్ణయం తీసుకున్నారు. ఈ సంవత్సరం కూడా గడిచిన 15 రోజులుగా ఒప్పందాలు సాగుతున్నాయి. గ్రామాల పరిధి లో విత్తన కంపెనీల యజమానులు రైతులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. 

క్వింటాలు రూ.2,500కే ఒప్పందం

జిల్లాలో గత సంవత్సరం 40 వేల ఎకరాలకుపైగా ఎర్ర జొన్న సాగైంది. ఈ సంవత్సరం ఆరుతడి పంటలు వేయాలని ప్రభుత్వం సూచించడంతో 50వేల ఎకరాలకుపైగా సా గయ్యే అవకాశం ఉన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు అ ంచనా వేస్తున్నారు. గత సంవత్సరం క్వింటాలు ఎర్రజొన్నలకు రూ.2,500ల నుంచి రూ.3,500ల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఈ ఏడాది మాత్రం వ్యాపారులు రూ.2,500కే ఒప్పందం చేసుకుంటున్నారు. గత సంవత్సరం కొనుగో లు చేసిన ఎర్రజొన్నలు ఇప్పటికీ గోడౌన్‌లో స్టాక్‌గా ఉండ డంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. గ్రామాల వారీగా రైతులు ఎక్కువ ధర డిమాండ్‌ చేస్తున్నా.. వ్యాపారులు మాత్రం పెంచడంలేదు. ప్రతీ సంవత్సరం సీజన్‌లో రైతు లు ఒప్పందాల పరంగా ధరలు ఉంటే ఆ వ్యాపారికి కొంతమొత్తంలో ఇచ్చి మిగతావి వేరే వ్యాపారులకు అమ్ముకునేవారు. మెజార్టీ రైతులు ఒప్పందం చేసుకున్నవారికే ఇచ్చే వారు. ఈ సంవత్సరం ఒప్పందాలు చేసుకుంటున్నా పంట పండిన తర్వాత డిమాండ్‌ ఉంటే ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చని రైతులు భావిస్తున్నారు. గ్రామాల్లో కమిటీల ద్వారా ఈ ఒప్పందాలు చేసుకుంటున్నారు. 

ఒప్పందం తప్పసరి అంటున్న అధికారులు

జిల్లాలో ఈ యాసంగిలో ఎర్రజొన్న సాగుకు ముందు రైతులు తప్పనిసరిగా ఒప్పందాలు చేసుకునేవిధంగా వ్యవసాయ అధికారులు చూస్తున్నారు. ఆయా మండలాల పరిధిలోని ఏఈవోలు క్లస్టర్‌ల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. జిల్లాలో ఈ సంవత్స రం ఎర్రజొన్నల సాగు ఎక్కువ మొత్తంలో అయ్యే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మేకల గోవిం ద్‌ తెలిపారు. రైతులు తప్పనిసరిగా ఒప్పందాలు చేసుకుని విత్తనాలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఒప్పందం ప్రకారం పంట పండిన తర్వాత అదే కంపెనీకి విక్రయించాలన్నారు. ప్రతీ ఏడాది పంట పండిన తర్వాత విక్రయ సమయంలో ఇబ్బందులు ఏర్పడుతుండడంతో ఒప్పందాలు తప్పనిసరి చేశామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-10-08T05:21:26+05:30 IST