ఆందోళనలో అన్నదాత

ABN , First Publish Date - 2021-03-22T05:33:12+05:30 IST

జిల్లాలో వరిపంట కోతకు వస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నే టికీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన చే యకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళనలో అన్నదాత

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసెత్తని ప్రభుత్వం 

ఆశగా ఎదురు చూస్తున్న జిల్లా రైతాంగం

ఈసారి జిల్లాలో భారీగా పెరిగిన వరి విస్తీర్ణం

గత రెండు సీజన్లకంటే ఎక్కువ మొత్తంలో సాగు

ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే ఇబ్బందులే!

సర్కారు నిర్ణయం కోసం చూస్తున్న అధికారులు

నిజామాబాద్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వరిపంట కోతకు వస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నే టికీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన చే యకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ప్రభుత్వమే పండించిన మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండడం, దిగుబడి కూడా ఎ కరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు వస్తుండడంతో ఎక్కు వ మంది రైతులు వరి పంటనే సాగు చేస్తున్నారు. జిల్లాలో వరిసాగు విస్తీర్ణాన్ని పెంచారు. విస్తీర్ణం పెరిగిన ఈ సమయంలో పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొనకుం టే ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ శాసనసభలో ధాన్యం కొంటామని ప్రకటించినా.. నేటికీ మా ర్గదర్శకాలను వెలువరించకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో వర్ని, రుద్రూరు ప్రాంతంలో కొంత మం ది రైతులు వరి కోతలను మొదలుపెట్టారు. నవంబరు, డిసె ంబరు నెలల్లో వేసిన పంట ప్రస్తుతం చేతికి వస్తుండడంతో కోతలు మొదలుపెట్టారు. కొంతమంది రైతులు పొలాల వ ద్దనే ప్రైవేటు వ్యాపారులకు అమ్మేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలపై ప్రకటన చే యకపోవడంతో వచ్చిన రేటుకే అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేంత వరకు ధాన్య ం ఉంచితే ఇబ్బందులు వస్తాయని భావిస్తున్న రైతులు అ మ్మకాలకు సిద్ధవుతున్నారు.

యాసంగిలో పెరిగిన వరిసాగు

జిల్లాలో యాసంగిలో వరిసాగు గణనీయంగా పెరిగింది. గత మూడేళ్లతో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోం ది. ఏటేటా వరికి మద్దతు ధర వస్తుండడంతో రైతులు సా గు విసీర్ణం పెంచుతున్నారు. గడిచిన మూడేళ్లుగా జిల్లాలో యాసంగిలో వరిసాగు భారీ గా పెరుగుతోంది. వానాకాలంతో సమానంగా రైతులు వరిని సాగుచేస్తున్నా రు. భూగర్భజలాలతో పా టు ప్రాజెక్టులలో సాగునీ రు అందుబాటులో ఉండడ ంతో రైతులు ఎక్కువ మొత్త ంలో వరి పంటను సా గుచేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగో లు చేయడం, మద్దతు ధర వస్తుండడంతో ఎక్కువ మంది రైతులు ఇతర పంటలను వదిలి వరిసాగువైపు మొగ్గుచూపారు. జి ల్లాలో ఈ సంవత్సరం యాసంగిలో 3లక్షల 85 వేల 283 ఎకరాల్లో వరిని సాగు చేశారు. గడిచిన మూడేళ్ల లో అత్యధికంగా ఈ యాసంగిలోనే సాగు చేశారు. గత సం వత్సరం యాసంగిలో జిల్లాలో 3లక్షల 83వేల 247 ఎకరాల్లో సాగు చేశారు. గత సంవత్సరంలో పోలిస్తే ఈసారి 2వేల ఎకరాల్లో సాగు విస్తీ ర్ణం పెరిగిది. జిల్లాలో 2019 యాసంగిలో 3లక్షల 18వేల 515 ఎకరాల్లో వరి పంటను వేశారు. అప్పటితో పోల్చుకుంటే ఈ సంవత్సరం సాగు పెరిగింది. జి ల్లాలో ప్రతీ యాసంగిలో సాధారణ వరిసాగు విస్తీర్ణం లక్షా 93వేల ఎకరాలు కాగా, గడిచిన కొన్నేళ్లుగా ఈ విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ఎస్సారెస్పీతో పాటు నిజాంసాగర్‌ ప్రాజెక్టు, గుత్ప అలీసాగర్‌ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని అందించడం వల్ల ఈ వి స్తీర్ణం పెరుగుతోంది. జిల్లాలో వర్షా లు పడడం, ప్రాజెక్టులు మూడే ళ్ల నుంచి నీళ్లతో ఉండడం, భూగర్భ జలాలు కూడా అందుబాటులో ఉండడం కూడా వరిసాగు పెరుగుతోంది. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వ డం వల్ల కూడా ఈ విస్తీర్ణ ం పెరిగింది. జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతుండగా ఇత ర పంటలు తగ్గుతున్నాయి. మొ క్కజొన్నతో పాటు జొన్న వేసే రైతు లు కూడా ఈ యాసంగిలో వరిసాగు వైపే మొగ్గుచూపారు. మొక్కజొన్నకు కొనుగోలు చేసేవారు లేకపోవడం, మద్దతు ధరకన్న తక్కువగా వస్తుండడ ంతో రైతులు వరిసాగువైపు మొగ్గుచూపారు. 

ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం నుం చి మౌఖిక ఆదేశాలు ఉండడంతో జిల్లా అధికారులు ఏర్పా ట్లలో నిమగ్నమయ్యారు. మొదట మార్కెట్‌యార్డులో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఏడు మార్కెట్‌యార్డు, ఒక సబ్‌మార్కెట్‌లో మొదట కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుకు అవసరమైన 2 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధం చేస్తున్నారు. మార్కెట్‌యార్డులో అందుబాటులో ఉన్న హ మాలీలతో పాటు ఇతర హమాలీలను కూడా అవసరం మే రకు సమకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం రవాణాకు అవసరమైన వాహనాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటిలాగే కొనుగోలు కేంద్రాలకు అనుమతిస్తే వెంటనే కొనేవిధంగా ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

జిల్లాలో వరిసాగు పెరిగింది : మేకల గోవింద్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

జిల్లాలో సాగునీరు అందుబాటులో ఉండడంతో ఈ సారి వరి సాగు పెరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి మేకల గోవింద్‌ తెలిపారు. గత ఏడాదికంటే ఈ యాసంగిలో విస్తీ ర్ణం పెరిగిందన్నారు. కరెంటు, నీళ్లు అందుబాటులో ఉండ డం, కూలీల ఇబ్బంది లేకపోవడం వల్ల ఎక్కువ మంది రై తులు వరిసాగువైపు మొగ్గుతున్నారని ఆయన తెలిపారు. 

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశాం : జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ధాన్యం కొ నుగోళ్లకు ఏర్పాట్లు చేశామని పౌరసరఫరాల శాఖ, సంస్థ అ ధికారులు వెంకటేశ్వర్‌రావు, అభిషేక్‌సింగ్‌ తెలిపారు. గన్నీ బ్యాగులు సిద్ధం చేసి ఉంచామని తెలిపారు. ప్రభుత్వం ఆదే శాలు ఇవ్వగానే ధాన్యం కొనుగోళ్లు చేపడతామన్నారు. 

Updated Date - 2021-03-22T05:33:12+05:30 IST