విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి

ABN , First Publish Date - 2021-02-09T05:11:22+05:30 IST

వరి పంట పొ లంలో రసాయన ఎరువును చల్లేం దుకు వెళ్లిన ఓ వ్యవసాయ కూలీ విద్యుత్‌ షాక్‌ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి

కోటగిరి, ఫిబ్రవరి 8 : వరి పంట పొ లంలో రసాయన ఎరువును చల్లేం దుకు వెళ్లిన ఓ వ్యవసాయ కూలీ విద్యుత్‌ షాక్‌ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉ న్నాయి. కోటగిరి సహకార సంఘం అధ్యక్షు డు కూచీ సిద్ధుకు చెందిన పొలంలో రసా యన ఎరువును చల్లేందుకు సోమవారం కోటగిరి గ్రామానికి చెందిన ఎడ్డెడి గంగారాం (46)అనే వ్యవసాయ కూలీ పనికి వెళ్లారు. ఎరువుల బస్తా తలపై ఎత్తుకుని పొలం గట్టుపై నుంచి వెళుతుండగా విద్యుత్‌ తీగ ప్రమాదవశాత్తు తలిగింది. దీంతో విద్యుత్‌ తీగ తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి రూద్రూర్‌ సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సై మచ్చేందర్‌రెడ్డి చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకో వాలని పలువురు ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-02-09T05:11:22+05:30 IST