3వ తేదీ వరకు డిగ్రీ ఫీజు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2021-06-21T06:51:31+05:30 IST

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధి లోని అన్ని అనుబంధ కళాశాలల్లో గల డిగ్రీ, బీఏ, బీకాం, బీఏస్సీ, బీబీఏ, బీఏఎల్‌ కోర్సులకు చెందిన 4, 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌, 2వ బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు ఈనెల 21 వరకు ఉన్న ఫీజు గడువును విద్యార్థుల సౌకర్యార్థం జూలై 3వరకు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

3వ తేదీ వరకు డిగ్రీ ఫీజు గడువు పొడిగింపు

పరీక్షల నియంత్రణాధికారి డా.పాత నాగరాజు

డిచ్‌పల్లి, జూన్‌ 20: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధి లోని అన్ని అనుబంధ కళాశాలల్లో గల డిగ్రీ, బీఏ, బీకాం, బీఏస్సీ, బీబీఏ, బీఏఎల్‌ కోర్సులకు చెందిన 4, 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌, 2వ బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు ఈనెల 21 వరకు ఉన్న ఫీజు గడువును విద్యార్థుల సౌకర్యార్థం జూలై 3వరకు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. 100 రూపాయ ల ఆలస్య రూసుముతో జూలై 7వరకు, 500 రూపాయల ఆలస్య రుసుముతో జూలై 9వ వరకు, వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో జూలై 12 వరకు ఫీజు చెల్లించే ఆవకా శం కల్పించినట్లు సీవోఈ తెలిపారు. డిగ్రీ కళాశాలల ప్రధా నాచార్యులు, విద్యార్థులు ఈ విషయం గమనించాలన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాల ని ఆయన సూచించారు.

నేడు యోగా గురువులకు సన్మానం 

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించు కొని డిచ్‌పల్లి మండలంలోని తెలంగాణ విశ్వవిద్యాలయం లో గల పరిపాలన భవనం వద్ద జిల్లాలోని యోగా గురు వులను వాసవి క్లబ్‌ సిటిజన్‌ ద్వారా సన్మానించడం జరుగు తుందని నిర్వాహకులు తెలిపారు. విశ్వవిద్యాలయంలో 11 గంటలకు సన్మాన కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఔత్సాహికులు పాల్గొన వచ్చని వారు తెలిపారు.

Updated Date - 2021-06-21T06:51:31+05:30 IST