అంతా.. ఔట్‌

ABN , First Publish Date - 2021-10-31T06:45:51+05:30 IST

అంతా అనుకున్నట్లు గానే తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇటీవల అక్ర మంగా చేపట్టిన 113 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రద్దు చేసింది. శనివారం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఈసీ సమావేశంలో ‘టీయూలో కొత్త పోస్టుల కిరికిరి’పై ‘ఆంధ్రజ్యోతి’ మినీలో ప్రచురితమైన వరుస కథనాలు

అంతా.. ఔట్‌
నూతన రిజిస్ర్టార్‌ యాదగిరికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న మాజీ రిజిస్ర్టార్‌ కనకయ్య

తెలంగాణ విశ్వవిద్యాలయంలో 113 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల రద్దు
సంచలనం సృష్టించిన ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు
రిజిస్ర్టార్‌గా కనకయ్య తొలగింపు
నూతన రిజిస్ట్రార్‌గా యాదగిరి  
డిచ్‌పల్లి మెయిన్‌ క్యాంపస్‌ వద్ద భారీ పోలీసు భద్రత
ఈసీ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలను ప్రకటించిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి
హర్షం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు
యూనివర్సిటీ అభివృద్ధికి కలిసి రావాలన్న కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌
నవంబరు 27న మరోసారి సమావేశం

డిచ్‌పల్లి, అక్టోబరు 30: అంతా అనుకున్నట్లు గానే తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇటీవల అక్ర మంగా చేపట్టిన 113 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రద్దు చేసింది. శనివారం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఈసీ సమావేశంలో ‘టీయూలో కొత్త పోస్టుల కిరికిరి’పై ‘ఆంధ్రజ్యోతి’ మినీలో ప్రచురితమైన వరుస కథనాలు అవనీతి ప్రకంపనల ను తేటతెల్లం చేశాయి. తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సమావేశానికి తొలిసారి విచ్చేసిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎలాం టి అనుమతులు లేకుండా చేపట్టిన పలు ఔట్‌ సో ర్సింగ్‌ పోస్టులను రద్దు చేయాలంటూ ఒకవైపు వి ద్యార్థి సంఘాల ఆందోళనలు చేపట్టడం, మరోవైపు ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు చేయడంతో రాష్ట్ర ఉన్న త విద్యా మండలి దిగివచ్చింది. ఇందులో మొదటి నుం చి కూడా ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న టీయూ రిజిస్ర్టార్‌ కనకయ్యను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా 113 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులను సైతం రద్దు చేసింది. దీంతో టీయూ పరిధిలోని పలు విద్యార్థి సంఘాలు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు సైతం హర్షం వ్యక్తం చేశారు.   
టీయూకు తొలిసారి కమిషనర్‌
విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన ఈసీ సమావేశానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈసీ సమావేశం సుదీర్ఘంగా సాయంత్రం 4గంటల వరకు కొనసా గింది. పాలకమండలి సభ్యులతో ఎజెండాలోని అంశాలను పూర్తిగా తెలుసుకున్న ఆయన ఎజెండాలో ఉన్న అంశాల ప్రక్రియ, కొత్త కోర్సుల ఏర్పాటు వంటి అంశా లను వెల్లడించారు. దీనిలో భాగంగా పాలకమండలి, ప్రభుత్వ అనుమతులు లే కుండా ప్రభుత్వ జీవోలను పక్కన పెట్టి ఇటీవల 113 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల రద్దు విషయాన్ని వీసీ రవీందర్‌ గుప్త కమిషనర్‌ పాలకమండలి సభ్యుల సమక్షంలో అధికారికంగా ప్రకటించడం గమనార్హం. విశ్వవిద్యాలయంలో అధికారి కంగా ఏ నియామకాలు చేసినా.. ఈసీ అనుమతులు, ప్రభుత్వ అనుమతులతోనే చేస్తామని వీసీ వెల్లడించారు. విశ్వవిద్యా లయంలో కొత్తగా డిజిటలైజేషన్‌ సిస్టింతో పనులు చేస్తామని, నవంబరు 1వ తేదీ నుంచి బయోమెట్రిక్‌ విధానం ప్రతీఒక్కరు తూ.చా. తప్పకుం డా పాటించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం పేర్కొన్నారు. ఈసీ సభ్యుల ఆమోదం మేరకే నూతన రిజిస్ట్రార్‌గా కామార్స్‌ విభాగాధి పతి ప్రొఫెసర్‌ యాదగిరిని నియామించడం జరిగిందని, త్వరలో పార్టుటై మ్‌ లెక్చరర్‌ పోస్టుల నియామకం కోసం నోటిపికేషన్‌ వేస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి భిక్కనూర్‌ సౌత్‌ క్యాంపస్‌లో బీకాం కంప్యూటర్స్‌, బీఏస్సీ ఫిజి కల్‌ సైన్స్‌, బీఏ, డిగ్రీ కోర్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
8 నెలల తర్వాత ఈసీ సమావేశం
తెలంగాణ విశ్వవిద్యాలయంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పా టు తర్వాత ఇప్పటి వరకు హైదరాబాద్‌లోనే ఈసీ సమావేశం వర్చువల్‌గా నిర్వహిస్తూ వచ్చారు. కమిషనర్‌ తాజాగా ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల అవకతవకలు, డబ్బులు చేతులు మారడం, ఈసీ సభ్యుల ఫిర్యాదు, విద్యార్థి సంఘాల ఆందోళ నల నేపథ్యంలో స్వయంగా టీయూలోనే ఈసీ సమావేశం నిర్వహించారు. టీయూలో ప్రస్తుతం వాస్తవ పరిస్థితుల ఎజెండా అంశాలను కూలకశంగా చర్చించారు. విశ్వవిద్యాలయంలో ఇప్పటి వరకు ఉన్న పోస్టుల వివరాలు, ఫీజుల వివరాలు, బడ్జెట్‌ వివరాలు, మంజూరైన నిధులు, భవనాల వివరాలపై సంబం ధిత శాఖ అధికారులకు రిపోర్టుల ఆధారంగా కమిషనర్‌ పరిశీలించారు. దీంతో అధికార యంత్రాంగం తర్జన భర్జన పడ్డారు. ఆరు గంట ల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈసీ సమావేశం ప్రశాంతం గా ముగియడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం  పేరుతో ఉన్న విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో కమిషనర్‌ తీసుకన్న నిర్ణాయాలు ఇటు పాలక మండలిని, అటు విద్యార్థి సంఘాలను సంతోష పరిచాయి. అంతేగాకుండా వివాద రహితుడు గతంలో రిజిస్ట్రార్‌గా అనుభవం ఉన్న ప్రొఫెసర్‌ యాదగిరిని ఈసీ సమావేశానికి పిలిచి ఈసీ సభ్యులు ఆమోదం మేరకు రిజిస్ట్రార్‌గా నియ మించారు. ఈ సమావేశంలో ఇది వరకు కొన సాగిన రిజిస్ర్టార్‌ కనకయ్యను విధుల నుంచి తప్పించడంతో బాఽధాతప్త హృదయాలతో యూనివర్సిటీ నుంచి వెనుదిరిగారు. చివరికి అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఈసీ సభ్యులు కనకయ్య ను పలకరించకపోవడం గమనార్హం. ఇటీవల రిజిస్ట్రార్‌ కార్యాలయం వాస్తు సక్రమంగా లేదనే తలంపుతో ప్రొఫెసర్‌ కనకయ్య కార్యాలయం పూర్తిగా వాస్తు మార్పులు చేసుకున్నప్పటికీ.. రిజిస్ట్రార్‌ పదవి కనకయ్యకు మూణ్నాళ్ల ముచ్చటాగానే మిగిలిపోయింది.
మెయిన్‌ క్యాంపస్‌ వద్ద పోలీసుల మోహరింపు
వర్సిటీలో నిర్వహించిన ఈసీ సమావేశంలో ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల రద్దు, రిజిస్ర్టార్‌ తొలగింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డిచ్‌పల్లిలోని మెయిన్‌ క్యాంపస్‌ వద్ద పోలీసులు భారీ మోహరించారు. అనుమానిత వ్యక్తులను లోనికి అనుమతించ లేదు. దీనిలో భాగంగా భద్రత ఏర్పాట్లను సీఐ రఘునాథ్‌ ఎస్సైలు ఆంజనేయులు, గైరిందర్‌ గౌడ్‌, ఆసిఫ్‌, పూర్ణేశ్వర్‌, మహిళా ఎస్సైలతో పర్యవేక్షించారు. చివరగా.. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు నుంచే తెలంగాణ పేరుతో ఉన్న ఈ విశ్వవిద్యాల యం మరింత అభివృద్ధి చెందేవిధంగా ప్రతీఒక్కరు కలిసి రావాలని కమిషనర్‌ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో వీసీ రవీందర్‌ గుప్త, రిజిస్ట్రార్‌ కనకయ్య, సభ్యులు ప్రొఫెసర్‌ నసీం, డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, వసుందర, డాక్టర్‌ మారయ్య గౌడ్‌, ఎల్‌ఎన్‌ శాస్త్రీ, గంగాధర్‌ గౌడ్‌, రవీందర్‌  రెడ్డి, నాగరాజు సభ్యుల సూచనాల మేరకు నూతన రిజిస్ట్రార్‌ యాదగిరి పాల్గొన్నారు.
ఇవీ ఈసీ సమావేశంలో కీలక నిర్ణయాలు
 రిజిస్ట్రార్‌ కనకయ్యను తొలగించి ప్రొఫెసర్‌ యాదగిరి నియామకం
 పొరుగు సేవల ఉద్యోగులను ఇప్పటి వరకు నియమించ లేదు
 నాన్‌టీచింగ్‌ ఉద్యోగుల రిటైర్డ్‌మెంట్‌ 58 నుంచి 61 ఏళ్లకు పెంపు
 గ్రాడ్యూటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంపు
 నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌కు పీఆర్సీ 2021 నుంచి అమలు
 సెల్ఫ్‌ పైనాన్స్‌కు సంబంధించిన జీవో 141 అమలు
 గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్‌లకు గైడ్‌షిప్‌
 వచ్యే విద్య సంవత్సరం నుంచి నూతన కోర్సు ఎంఎస్సీ జువాలజీ  
 భిక్కనూర్‌లో ఉన్న మొత్తం డిగ్రీ కోసం, విద్యార్థుల హాస్టల్‌ వసతి  
 వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ, పీజీ డిజిటైల్‌ ఎవల్యూయేషన్‌
 నవంబరు 1 నుంచి బయోమెట్రిక్‌ విధానం ప్రారంభం
 ఓయూలో ఉన్నట్లు యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టం అమలు
 ఈసీ సమావేశం నవంబరు 26 లేదా 27న ఒక్క రోజు ఉంటుంది.

Updated Date - 2021-10-31T06:45:51+05:30 IST