16నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ABN , First Publish Date - 2021-10-14T06:33:29+05:30 IST

ఈ నెల 16 నుంచి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతిగింజను కొనుగోలు చేస్తామని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. వర్ని మండల కేంద్రంలో బుధవారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా మూడ్‌ కవిత అంబర్‌సింగ్‌, ఉపాధ్యక్షుడిగా వెలగపూడి గోపాల్‌ సహా పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు

16నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
మాట్లాడుతున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

వర్ని, అక్టోబరు 13: ఈ నెల 16 నుంచి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతిగింజను కొనుగోలు చేస్తామని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. వర్ని మండల కేంద్రంలో బుధవారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా మూడ్‌ కవిత అంబర్‌సింగ్‌, ఉపాధ్యక్షుడిగా వెలగపూడి గోపాల్‌ సహా పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులైన పేదల దరి చేరేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. పదవి వ్యామోహం వీడి, పాలకుడిగా ప్రజలకు ఏం చేశానో తన విధుల బాధ్యతల నిర్వహణ పరిపాలన సౌలభ్యంగా ఉందో లేదోనని ప్రతీ పాలకుడు గ్రహించాలని పోచారం హితవు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పేదల కోసం సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టారని, నాయకులు తలెత్తుకుని తిరిగేలా పథకాలను ప్రజల ధరికి చేర్చాలన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయ శాఖ నెంబర్‌ వన్‌గా నిలిచిన తృప్తి తన జన్మకు సార్థకమని స్పీకర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇందులో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ బాధ్యులు సురేందర్‌ రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్‌, జడ్పీటీసీలు భాస్కర్‌రెడ్డి, హరిదాస్‌, ఎంపీపీలు మేక శ్రీలక్ష్మి, అక్కపల్లి సుజాత, రైతు సమన్వయ అధ్యక్షుడు సింగంపల్లి గంగారాం, పిట్ల శ్రీరాం, హన్మంత్‌రెడ్డి, గిరి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-14T06:33:29+05:30 IST