సరిహద్దులో చెక్‌పోస్టు ఏర్పాటు

ABN , First Publish Date - 2021-07-09T05:03:34+05:30 IST

బక్రీద్‌ పండుగ నేపథ్యంలో మండలంలోని సలాబత్‌ పూర్‌ వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేశామని ఎస్సై రాజు తెలిపారు.

సరిహద్దులో చెక్‌పోస్టు ఏర్పాటు
మహారాష్ట్రకు వెళుతున్న గోవుల వాహనాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు

మద్నూర్‌, జూలై 8: బక్రీద్‌ పండుగ నేపథ్యంలో మండలంలోని సలాబత్‌  పూర్‌ వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేశామని ఎస్సై రాజు తెలిపారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మహారాష్ట్ర నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. గురువారం చెక్‌పోస్టును ఏర్పాటు చేశామని, ఈ చెక్‌ పోస్టు బక్రీద్‌ పండుగ పూర్తయ్యే వరకు ఉంటుందని తెలిపారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా వస్తున్న గోవులకు సంబంధించిన వాహనాలను, అక్రమం గా ఎవరైనా తరలిస్తే నిఘా వేశామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతి ఉన్నట్లయితే వాటికి పంపిస్తామని, లేదంటే వాహనాలను సీజ్‌ చేస్తామని తెలిపారు. ఈ తనిఖీలో పశువైద్యాధికారి విజయ్‌, మోహన్‌, పోలీస్‌ సిబ్బంది తదితరులున్నారు.
నాగిరెడ్డిపేట: మండల కేంద్రంలో పోలీసులు ప్రత్యేక చెక్‌పోస్టును ఏర్పా టు చేశారు. ముస్లింల బక్రీద్‌ పండుగ సందర్భంగా ఈ ప్రాంతం నుంచి గో వులను, పశువులను అక్రమంగా హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు తరలించ కుండా ఉండేందుకు కామారెడ్డి-మెదక్‌ జిల్లాల సరిహద్దు మండలమైన నాగి రెడ్డిపేట మండల కేంద్రంలో ప్రత్యేక పోలీస్‌ చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు.  మెదక్‌-హైదరాబాద్‌ వైపు వెళుతున్న వాహనాలను చెక్‌పోస్టు వద్ద ఆపి పోలీ సులు తనిఖీ చేస్తున్నారు. చెక్‌పోస్టు వద్ద ప్రొహిబీషనరీ ఎస్సై విష్ణువర్ధన్‌, ఏఎస్సై సుబ్రహ్మణ్యంచారి, పోలీస్‌ సిబ్బంది కార్తీక్‌, రాజు, హమీద్‌లు విధులు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2021-07-09T05:03:34+05:30 IST