లక్కీడ్రా నిర్వహిస్తున్న ఎనిమిది మంది అరెస్ట్
ABN , First Publish Date - 2021-03-21T06:01:06+05:30 IST
మండలంలోని లక్ష్మీనగర్‌తండా శివారులో ప్రభుత్వ అనుమతి లేకుండా లక్కీడ్రా నిర్వహిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకు న్నట్లు భిక్కనూరు ఎస్సై నవీన్‌కుమార్ శనివారం తెలిపారు.

రూ.5,31,430లు, బహుమతుల స్వాధీనం
భిక్కనూరు, మార్చి 20: మండలంలోని లక్ష్మీనగర్‌తండా శివారులో ప్రభుత్వ అనుమతి లేకుండా లక్కీడ్రా నిర్వహిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకు న్నట్లు భిక్కనూరు ఎస్సై నవీన్‌కుమార్ శనివారం తెలిపారు. ఎస్సై తెలిపిన కథనం ప్రకారం కామారెడ్డికి చెందిన మునిరోద్దిన్ కామారెడ్డి చుట్టుపక్కల గ్రామాల ప్రజ లకు బహుమతులను ఆశచూపి వారి నుంచి నెలకు రూ.2500లను వసూలు చేస్తున్నాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా విజయలక్ష్మీ ట్రేడర్స్ పేరుతో లక్కీడ్రా నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు డ్రా నిర్వహిస్తున్న ఫాంహౌస్ పై దాడి చేసి నిర్వహాకుడు మునిరోద్దిన్‌తోపాటుగా ఏడుగురు ఏజెంట్లను అదుపు లోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు.