జిల్లా వాసికి దుబాయి గోల్డెన్‌ వీసా

ABN , First Publish Date - 2021-11-01T05:23:34+05:30 IST

వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం మం జూరు చేస్తున్న గోల్డెన్‌ వీసాను మాక్లూర్‌ మండలం మానిక్‌భండార్‌కు చెందిన సంతోష్‌కుమార్‌గౌడ్‌ పొందారు. వివిధ కేటగిరిల్లో గోల్డెన్‌ వీసాను అక్కడి ప్రభుత్వం మంజూరు చేస్తుంది.

జిల్లా వాసికి దుబాయి గోల్డెన్‌ వీసా


నిజామాబాద్‌అర్బన్‌, అక్టోబరు 31
: వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం మం జూరు చేస్తున్న గోల్డెన్‌ వీసాను మాక్లూర్‌ మండలం మానిక్‌భండార్‌కు చెందిన సంతోష్‌కుమార్‌గౌడ్‌ పొందారు. వివిధ కేటగిరిల్లో గోల్డెన్‌ వీసాను అక్కడి ప్రభుత్వం మంజూరు చేస్తుంది. పదేళ్లుగా సంతోష్‌కుమార్‌గౌడ్‌ దుబాయిలోని వివిధ యూనివ ర్సిటీల్లో పనిచేస్తున్నారు. ప్రతిభావంతుల కేటగిరిలో ఎడ్యూకేష న్‌ విభాగంలో ఆయనకు పదేళ్ల కాల పరిమితితో గోల్డెన్‌ వీసాను మంజూరు చేసింది. ఈ విభాగంలో పొందిన మొదటి భారతీయుడిగా సంతోష్‌కుమార్‌గౌడ్‌ నిలిచారు.

Updated Date - 2021-11-01T05:23:34+05:30 IST