టీయూ స్పోర్ట్స్‌ ఇన్‌చార్జిగా డాక్టర్‌ మహమ్మాద్‌ అబ్దుల్‌ ఖవీ

ABN , First Publish Date - 2021-02-09T05:07:42+05:30 IST

టీయూ ఉర్దూ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫె సర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ అబ్దుల్‌ ఖవి యాత్‌వేల్ఫెర్‌ ఆఫీసర్‌, స్పోర్ట్స్‌ ఇన్‌చార్జుగా నియామకమయ్యారు.

టీయూ స్పోర్ట్స్‌ ఇన్‌చార్జిగా డాక్టర్‌ మహమ్మాద్‌ అబ్దుల్‌ ఖవీ

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 8: టీయూ ఉర్దూ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫె సర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ అబ్దుల్‌ ఖవి యాత్‌వేల్ఫెర్‌ ఆఫీసర్‌, స్పోర్ట్స్‌ ఇన్‌చార్జుగా నియామకమయ్యారు. ఈ మేరకు టీయూ ఉపకులపతి నీతూకుమారీ ప్రసాద్‌ ఆదేశాల మేరకు రిజిస్ర్టార్‌ ఆచార్య నసీం నియమాక పత్రాలను సోమవారం డాక్టర్‌ అబ్దుల్‌ ఖవికి అందించారు. 

పదవురు ప్రొఫెసర్లకు అడ్మినిస్ర్టేషన్‌ పదవులు 

తెలంగాణ విశ్వవిద్యాలయలో పనిచేస్తున్న డాక్టర్‌ రాంబాబుకు అకా డమిక్‌ ఆడిట్‌ సెల్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా, డాక్టర్‌ భ్రమరాంబికకు అడి షనల్‌ కంట్రోలర్‌గా, డాక్టర్‌ సాయిలు బీసీ సెల్‌ డెరెక్టర్‌గా, డాక్టర్‌ ఎన్‌ స్వప్నకు ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌-1 ఆఫీసర్‌గా, డాక్టర్‌ మహేందర్‌ ఎన్‌ ఎస్‌ఎస్‌ రెండో యూనిట్‌ ఆఫీసర్‌గా, ఎన్‌ఎస్‌ఎస్‌ మూడో యూనిట్‌ ఆఫీసర్‌గా డాక్టర్‌ స్రవంతి, ఎన్‌ఎస్‌ఎస్‌ 4వ యూనిట్‌ ఆఫీసర్‌గా డాక్ట ర్‌ నాగరాజు, ఎన్‌ఎస్‌ ఎస్‌ యూనిట్‌ ప్రోగాం 6వ ఆఫీసర్‌గా భిక్క నూర్‌ నియమాకపత్రాలను అందుకున్నారు. పలువురు అడ్మినిస్ర్టేషన్‌ పదవులు అలంకరించిన అధ్యాపకులు ఉపకులపతి నీతూకుమారీ ప్రసాద్‌, రిజిస్ర్టార్‌ ఆచార్య నసీంలకు ఽకృతజతాలు తెలిపారు. 

Updated Date - 2021-02-09T05:07:42+05:30 IST