నేటి నుంచి దోస్త్ 2021 ప్రత్యేక దశ రిజిస్ట్రేషన్లు
ABN , First Publish Date - 2021-11-06T05:14:59+05:30 IST
కళాశాల యాజ మాన్యలు తల్లిదండ్రులు విద్యార్థుల అభ్యర్థన మేర కు అండర్ గ్రాడ్యూట్ యూజీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలని దోస్త్ కార్యాలయం నిర్ణయించినట్లు వర్సి టీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి తెలిపారు.

డిచ్‌పల్లి, నవంబరు 5: కళాశాల యాజ మాన్యలు తల్లిదండ్రులు విద్యార్థుల అభ్యర్థన మేర కు అండర్ గ్రాడ్యూట్ యూజీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలని దోస్త్ కార్యాలయం నిర్ణయించినట్లు వర్సి టీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి తెలిపారు. ప్రత్యేక దశ శనివరం నుంచి ప్రారంభం అవుతుం దన్నారు. దోస్త్‌లో నమోదు చేసుకున్న విద్యార్థులు, సీటు పొందలేక పోయిన వారు వెబ్ ఆప్షన్లు ఉప యోగించవచ్చని అలాంటి విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.400 చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. మునుపటి దశలో సీటు పొంది తమ సీ టును నిర్ధారించుకొని విద్యార్థులు వెబ్ చేయవ చ్చని తెలిపారు. అదే దోస్త్ ఐడీలో ఎంపికలు కానీ వారు రిజిస్ట్రేషన్ రుసుం రూ.400 చెల్లిచాలని తెలిపారు. దోస్త్ 2021లో నమోదు చేసుకోని విద్యార్థులు నమోదు రుసుము చెల్లించి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దోస్త్ 2021లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు గణనీయమైన సంఖ్యలో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని కోరారు. విద్యార్థులకు సమస్యలు ఉంటే దోస్త్ ఆన్‌లైన్ గివెన్ సెంటర్ కు సంప్రదించాలని, మరిన్ని వివరాలకు 79010 02200 నంబరు కు సంప్రదించాలని సూచించారు.