కన్నుల విందుగా డోలోత్సవం

ABN , First Publish Date - 2021-11-21T07:11:09+05:30 IST

భీమ్‌గల్‌ లింబాద్రిగుట్టపై శనివారం శ్రీలక్ష్మీనర్సింహస్వామివారి డోలోత్సవాన్ని బ్రాహ్మణోత్తములు కన్నుల విందుగా నిర్వహించారు. 12రోజుల క్రితం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో ఫలప్రదం అయ్యేందుకు గాను చివరి రోజు శని వారం కార్యక్రమాలను నిర్వహించారు.

కన్నుల విందుగా డోలోత్సవం

ముగిసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు

భీమ్‌గల్‌, నవంబరు 20: భీమ్‌గల్‌ లింబాద్రిగుట్టపై శనివారం శ్రీలక్ష్మీనర్సింహస్వామివారి డోలోత్సవాన్ని బ్రాహ్మణోత్తములు కన్నుల విందుగా నిర్వహించారు. 12రోజుల క్రితం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో ఫలప్రదం అయ్యేందుకు గాను చివరి రోజు శని వారం కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగానే సర్వ దేవతోద్వాసనము, ఉద్వాసన బలిప్రదానం, ధ్వజారోహణం, ఈశన్య కొండబలి కార్యక్రమాలను, మేళతాళలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణాల మధ్య నిర్వహించారు. అనంతరం స్వామివారికి మంగళహారతి పూర్తయిన పిమ్మట మహాదాశీర్వదం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని అందంగా అలంకరించిన పల్లకిలో గర్భాలయానికి తరలించి మూలవిరాట్‌కు స్వర్ణాలంకృతుడిగా అలంకరించారు. కొండకింద జాతర సందర్భం గా వివిధ ప్రాంతాల నుంచి లింబాద్రిగుట్టకు వనభోజనాల కోసం వచ్చిన భక్తులు కొనుగోలుదారులతో సందడిగా మారింది. ఈ సందర్భంగా లింబాద్రిగుట్టపై గోవిందనామస్మరణాలతో భక్తులు జయజయ ధ్వనాలు చేస్తూ లింబాద్రిగుట్ట మార్మోగేలా చేశారు. 12రోజులుగా జరిగిన బ్రహ్మోత్సవాలు డోలోత్సవ కార్యక్రమంతో ముగిసాయని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు.

Updated Date - 2021-11-21T07:11:09+05:30 IST