టీయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు డాక్టరేట్‌

ABN , First Publish Date - 2021-05-03T05:18:42+05:30 IST

తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో గణిత విభాగం అసి స్టెంట్‌ ప్రొఫెసర్‌ (సి) కర్ణం శ్వేత డాక్టరేట్‌ను సా ధించారు.

టీయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు డాక్టరేట్‌

నిజామాబాద్‌అర్బన్‌, మే 2: తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో గణిత విభాగం అసి స్టెంట్‌ ప్రొఫెసర్‌ (సి) కర్ణం శ్వేత డాక్టరేట్‌ను సా ధించారు. మధ్యప్రదేశ్‌లోని సేహోర్‌ శ్రీసత్యసాయి యూనివర్సిటీ ఆల్‌గరితమ్‌ డెవలప్‌మెంట్‌, ఇంప్లి మెంటేషన్‌ ఫర్‌ ప్రక్షానల్‌ ఫంక్షన్‌ అనే అంశంపై ప రిశోధనకు గాను యూనివర్సిటీ విభాగం ప్రొఫెసర్‌ సోనల్‌ భారతి పర్యవేక్షణలో శ్వేత పరిశోధన ప త్రాలు పరిశీలించి డాక్టరేట్‌ను ప్రకటించారు. జిల్లాకు చెందిన కర్ణం అశోక్‌ కల్పన దంపతుల మొద టి కుమార్తె అయిన శ్వేత ఆరేళ్లుగా తెలంగాణ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ విభాగంగా అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. ఆమె పరిశోధన పత్రాలు పలు నేషనల్‌ రీసెర్చ్‌ జర్నల్స్‌లో ప్రచురితం అయ్యాయి. ఈ సందర్భంగా డాక్టరేట్‌ పొందిన ఆమెను యూనివర్సిటీ గణిత విభాగం హెచ్‌వోడీ డాక్టర్‌ సంపత్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ వాసం చంద్రశేఖర్‌లు అభినందించారు. 

పొన్నాల బాలయ్యకు డాక్టరేట్‌ 

డిచ్‌పల్లి, మే 2: టీయూహిందీ విభాగం పరిశోధకుడు, కవి, రచయిత పొన్నాల బాలయ్యకు పీహె చ్‌డీ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వ విద్యాలయంలోని హిందీ విభాగం అసోసియేట్‌ ప్రొ ఫెసర్‌ డాక్టర్‌ ప్రవీణ బాయి పర్యవేక్షణలో హిందీ, తెలుగు దళిత కవిత్వంలో శిల్పం, అభివ్యక్తీకరణ 2005, 2015 అంశంపై పీహెచ్‌బీ చేసి సిదాఽ్ధంత గ్రం థాన్ని రూపొందించి తెలంగాణ విశ్వ విద్యాల యానికి సమర్పించారు. వ ర్చుల్‌ వేదికగా ఏర్పాటు చేసిన పీహెచ్‌డీ ఓపెన్‌ వైవాకు హైదరాబాద్‌ యూనివర్సిటీ నుంచి హిందీ విభాగాపు ప్రొఫెసర్‌ ఆచార్య కృష్ణ హాజరై పరిధకుడిని పరిశోధన అంశాలపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ వైవాకు ఆర్ట్స్‌ పీఠాధిపతి ప్రొఫెసర్‌ కనకయ్య చైర్మన్‌గా బీవోఎస్‌ జమీల్‌ హైమాద్‌ కన్వీనర్‌గా వ్యవహ రించారు. విభాగాధిపతి డాక్టర్‌ వి.పార్వతి అధ్యాపకులు, పరిశోధకులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కెమిస్ట్రీలో హన్మాండ్లుకు... 

డిచ్‌పల్లి, మే 2:  టీయూ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొ ఫెసర్‌, బీవోఎస్‌ డాక్టర్‌ బి.సాయిలు పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి హ న్మాండ్లు సింథసిస్‌ అండ్‌ బయోలజికల్‌ ఆర్టీవీటీ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధంత గ్రంథాన్ని రూపొందించారు. ఓపెన్‌ వైవా వర్చువల్‌కు జెఎన్‌ టీయూ హైదరాబాద్‌ నుంచి ఆచార్య తిరుమల చారి ఎక్స్‌టర్నల్‌ ఎక్సామి నార్‌గా హాజరయ్యారు. ఈ వైవాకు సైన్స్‌ టీం ఆచార్య విద్యావర్ధిని ఛైర్మన్‌ గా వ్యవహరించారు. విభాగాధిపతి డాక్టర్‌ బాలకిషన్‌, అసోసియేట్‌ ప్రొఫె సర్‌ డాక్టర్‌ నాగరాజు అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు. 

బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో వాసంతికి 

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఆచార్య కైసర్‌ మహమ్మాద్‌ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి వాసంతికి డాక్టరేట్‌ ప్రదానం చేశారు. ఏ కంపారీటీవ్‌ స్టడీ ఆఫ్‌ ఆర్గానైజేషన్‌ సిటిజన్‌ షిప్‌ ఇన్‌ సెలక్ట్‌ సర్వీస్‌ సెక్టర్‌ అనే అంశంపై పరిశోధన చేసి గ్రంథాన్ని రూపొందించారు. ఈ వర్చువల్‌ వైవాకు ఎక్స్‌టర్నల్‌ కార్యక్రమంలో కామ ర్స్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ ప్రొఫెసర్‌ యాదగిరి ఛైర్మన్‌గా, బీవోఎస్‌గా వాణి, కన్వీనర్‌గా వ్యవహరించారు. విభాగాఽధిపతి డాక్టర్‌ రాజే శ్వరి అ ధ్యా పకులు డాక్టర్‌ అపర్ణ, డాక్టర్‌ అంజనేయులు పాల్గొన్నారు. ఆదివారం పొన్నాల బాలయ్య, హన్మాండ్లు, వాసంతి, పీహెచ్‌డీ సాధించడం పట్ల ఉపకులపతి నీతూ ప్రసాద్‌, రిజిస్ర్టార్‌ ఆచార్య నసీం, ప్రిన్సిపాల్‌ వాసం చంద్రశేఖర్‌, డాక్టర్‌ పాత నాగరాజు, పీఆర్వో త్రివేణి అభినందించారు. 


Updated Date - 2021-05-03T05:18:42+05:30 IST