ఆలయ భూములు రక్షించాలని ధర్నా

ABN , First Publish Date - 2021-02-06T03:59:04+05:30 IST

బోధన్‌లోని మారుతి మందిరం భూములను ర క్షించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట శివ సేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఆలయ భూములు రక్షించాలని ధర్నా
ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న శివసేన నాయకులు

బోధన్‌, ఫిబ్రవరి 5 : బోధన్‌లోని మారుతి మందిరం భూములను ర క్షించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట శివ సేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మారుతి మందిరం భూములను ఓ వర్గానికి చెందిన వారు కబ్జా చేసుకున్నారని ఆరోపించారు. వారి నుంచి ఈ భూములను స్వాధీనం చేసుకొని రక్షణ కల్పించాలని కోరారు. ఎకరం 22 గుంటల భూమి కబ్జాకు గురైందని తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని డి మాండ్‌ చేశారు. ఆలయ కమిటీకి భూములను తిరిగి అప్పగించాలని ఆర్డీవో రాజేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శివసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పసులోటి గోపికిషన్‌, ప్రీతం, కిశోర్‌, కృష్ణ, లోకేష్‌గౌడ్‌, బాలు, నరేందర్‌, కిరణ్‌, శ్రీకాంత్‌, ఈశ్వర్‌, శివ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-06T03:59:04+05:30 IST