రెండు గంటలు నిలిచిన దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు
ABN , First Publish Date - 2021-01-12T06:19:06+05:30 IST
రామారెడ్డి మండలం మోషం పూర్-రంగంపేట గ్రామాల మధ్య దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు 2 గంటల పాటు సాంకేతికలోపంతో నిలిచింది.

సాంకేతిక లోపం కారణంగానే
రామారెడ్డి, జనవరి11: రామారెడ్డి మండలం మోషం పూర్-రంగంపేట గ్రామాల మధ్య దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు 2 గంటల పాటు సాంకేతికలోపంతో నిలిచింది. దీంతో ప్ర యాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ నుంచి ముంబాయి వెళ్తున్న రైలు మోషంపూర్-రంగంపే ట గ్రామాల మధ్య ఉన్న సిగ్నల్ వద్ద రెండు గంటలపా టు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. సిబ్బంది స్పందిం చి సమస్య పరిష్కరించడంతో రైలు కదిలింది.