చిట్యాలలో ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం

ABN , First Publish Date - 2021-08-10T05:39:00+05:30 IST

మండలంలోని చిట్యాలలో ఆదివారం రాత్రి టాన్స్‌ ఫార్మర్‌ ధ్వంసం చేశారు. ఎస్‌ఎస్‌ 9916 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి వైరును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

చిట్యాలలో ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం

తాడ్వాయి, ఆగస్టు 9: మండలంలోని చిట్యాలలో ఆదివారం రాత్రి టాన్స్‌ ఫార్మర్‌ ధ్వంసం చేశారు. ఎస్‌ఎస్‌ 9916 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి వైరును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ట్రాన్స్‌ఫార్మర్‌ పగులగోట్టి అందులోకి వైరును ఎత్తుకెళుతున్నారు. తరచూ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ట్రాన్స్‌కో ఏఈవో కరుణాకర్‌ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఏడు ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయని రైతులు పేర్కొన్నారు. చోరీకి గురైన ట్రాన్స్‌ఫార్మర్‌ల స్థానంలో కొత్తవాటిని భిగించాలని కోరారు. ఈ విషయమై ఏఈ కరుణాకర్‌ మాట్లాడుతూ ట్రాన్స్‌ఫార్మర్ల ప్రతిపాదనలు తయారు చేసి అధికారులకు పంపి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. ఎస్‌ఐ కృష్ణమూర్తికి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-08-10T05:39:00+05:30 IST