పాఠశాలలను సందర్శించిన డీఈవో

ABN , First Publish Date - 2021-02-06T03:59:55+05:30 IST

నవీపేటలోని జడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠ శాల ను, మోకన్‌పల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను శుక్రవారం డీఈవో దుర్గా ప్రసాద్‌ పరిశీలించారు.

పాఠశాలలను సందర్శించిన డీఈవో

నవీపేట, ఫిబ్రవరి 5 : నవీపేటలోని జడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠ శాల ను, మోకన్‌పల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను శుక్రవారం డీఈవో దుర్గా ప్రసాద్‌ పరిశీలించారు. పాఠశాలల్లో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశం మేరకు ఉన్నత పాఠ శాలలోని 9, 10వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తు న్నామ న్నారు. విద్యార్థుల హాజరు శాతం క్రమంగా పెరుగుతోందన్నారు. పదో తరగతి విద్యార్థులు రాబోయే వార్షిక పరీక్షలు దృష్టిలో ఉంచుకొని శ్రద్ధగా చదవాలని సూచించారు. కార్యక్రమంలో కస్తూర్బా బాలికల పాఠశాల ప్రత్యేక అధికారిని రాణి, ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు. 

రెంజల్‌: మండలంలోని పలు పాఠశాలను డీఈవో దుర్గా ప్రసాద్‌ తనిఖీ చేశారు. మోడల్‌ పాఠశాల, కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యాబోధన కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు విషయా లపై అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఏంఈవో గణేష్‌రావు ఉన్నారు. 

Updated Date - 2021-02-06T03:59:55+05:30 IST