గౌస్‌ హత్య కేసులో నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2021-05-30T06:50:30+05:30 IST

జిల్లా కేంద్రంలోని 6వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ధర్మపురి ప్రాంతంలో ఈ నెల 23న జరిగిన బిహారిగౌస్‌ హత్యతో సంబంధం ఉన్న మరో ఆరుగురిని దక్షణ మండలం రూరల్‌ ఎస్సైలు రవి, ఆంజనేయులు అరెస్టు చేసినట్లు నిజామాబాద్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

గౌస్‌ హత్య కేసులో నిందితుల అరెస్టు

ఖిల్లా, మే 29: జిల్లా కేంద్రంలోని 6వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ధర్మపురి ప్రాంతంలో ఈ నెల 23న జరిగిన బిహారిగౌస్‌ హత్యతో సంబంధం ఉన్న మరో ఆరుగురిని దక్షణ మండలం రూరల్‌ ఎస్సైలు రవి, ఆంజనేయులు అరెస్టు చేసినట్లు నిజామాబాద్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం విలేకరుల స మావేశంలో వివరాలను వెల్లడించారు. గౌస్‌ను హత్యచేసిన వారిలో ఇప్పటికే 9 మందిని అరెస్టు చేశామని, శుక్రారం రాత్రి మరో ఆరుగురిని అరెస్టు చేశామని తెలిపారు. వారిని శనివారం కోర్టు ముందు హాజరుపర్చినట్లు ఆయన తెలిపారు. అరెస్టు చేసిన వారిలో షేక్‌ మోయిజ్‌ దొడ్డి కొమురయ్య కాలని, వై.రవి దొడ్డికొమురయ్య కాలని, బీ.సంతోష్‌, రాథోడ్‌ గణేష్‌, మాదవ్‌, షేక్‌ ఇమ్రాన్‌లను అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. ఏ1గా ఉన్న ఉస్మాన్‌ఖాన్‌కు సహకరించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. 15 మందిని రిమాండ్‌కు పంపిచామన్నారు. వీరికి రివార్డ్‌ కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని ఏసీనీ వివరించారు.

Updated Date - 2021-05-30T06:50:30+05:30 IST