బర్దీపూర్‌ హత్య కేసులో నిందితుల అరెస్టు: సీపీ

ABN , First Publish Date - 2022-01-01T05:16:50+05:30 IST

డిచ్‌పల్లి మండలంలోని బర్దీపూ ర్‌ గ్రామ సమీపంలో గల కెనాల్‌ వద్ద వ్యక్తిని హత్య చేసి న నిందితుడిని అరెస్టు చేసినట్లు సీపీ కేఆర్‌. నాగరాజు తెలిపారు.

బర్దీపూర్‌ హత్య కేసులో నిందితుల అరెస్టు: సీపీ

ఖిల్లా, డిసెంబరు 31: డిచ్‌పల్లి మండలంలోని బర్దీపూ ర్‌ గ్రామ సమీపంలో గల కెనాల్‌ వద్ద వ్యక్తిని హత్య చేసి న నిందితుడిని అరెస్టు చేసినట్లు సీపీ కేఆర్‌. నాగరాజు తెలిపారు. విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించా రు. ఈ నెల 29న బర్దీపూర్‌ గ్రామ శివారులో శేఖ్‌ మాజీద్‌ను నిజామాబాద్‌కు చెందిన జుబేర్‌, అతని చిన్న నాన్న షేక్‌ అతీఖ్‌ కలిసి హత్య చేశారు. హత్య చేసి అదే రోజు పోలీసులకు సమాచారాన్ని తెలిపారు. నిజామాబాద్‌ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్‌, డిచ్‌పల్లి సీఐ రఘునాథ్‌, ఎస్‌ఐ ఆంజనేయులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తల్లి సహేర బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అదనపు డీసీపీ నితీన్‌ పర్యవేక్షణలో వివరాలను సేకరించారు. మృతుడికి జుబేర్‌కు మధ్య పాత కక్షలు ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. హత్య చేసిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ నాగరాజు తెలిపారు. డిచ్‌పల్లి ఎస్సై ఆంజనేయులు, జాక్రన్‌పల్లి ఎస్సై ఎండి.ఆసీఫ్‌, ఇందల్‌వాయి ఎస్సై గౌరేందర్‌గౌడ్‌లను సీపీ అభినందించారు. సమావేశంలో అదనపు డీసీపీ వినీత్‌, ఏసీపీ ఏ.వెంకటేశ్వర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-01T05:16:50+05:30 IST