లైంగికదాడి కేసులో నిందితుడికి 20 యేళ్ల కఠిన కారాగార శిక్ష
ABN , First Publish Date - 2022-01-01T05:17:18+05:30 IST
కన్న కూతురిపై లైంగికదాడి చేసి గర్భందాల్చడానికి కారకుడైన తండ్రికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ 2వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు (ప్రత్యేక ఫోక్సో కోర్టు) జడ్జి సీహెచ్.పంచాక్షరి శుక్రవారం తీర్పు చెప్పారు.

నిజామాబాద్‌లీగల్, డిసెంబరు 31: కన్న కూతురిపై లైంగికదాడి చేసి గర్భందాల్చడానికి కారకుడైన తండ్రికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ 2వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు (ప్రత్యేక ఫోక్సో కోర్టు) జడ్జి సీహెచ్.పంచాక్షరి శుక్రవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే మోర్తాడ్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన రవిగౌడ్ హైదరాబాద్‌లో కూతురిని చదివిస్తానని చెప్పి ఫ్యాక్టరీలో కూలి పనిచేస్తూ జీవించేవాడు. కూతురిని భయపెట్టి బెదిరించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. కూతురు ఆరోగ్య పరిస్థితిని గమనించి నిలదీయడంతో అత్యాచారం, ఆపరేషన్ చేసి పిండాన్ని తొలగించిన విషయాన్ని తల్లికి వివరించింది. మోర్తాడ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ముద్దాయి రవిగౌడ్‌కి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధించింది. 2వ ము ద్దాయి వైద్యురాలు జయలక్ష్మి కరోనాతో మృతిచెందింది.