బ్లాక్ ఫంగస్‌తో ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-05-21T05:40:11+05:30 IST
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పెద్దవాల్గోట్ మాజీ సర్పంచ్ (60) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్‌తో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

సిరికొండ, మే 20 : నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పెద్దవాల్గోట్ మాజీ సర్పంచ్ (60) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్‌తో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. పది రోజుల క్రితం బ్లాక్ ఫంగస్ సోకగా నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు తెలిపారు.