ప్రమాదకరంగా కల్వర్టులు

ABN , First Publish Date - 2021-12-20T05:28:47+05:30 IST

బోధన్‌లోని పలు ప్రాంతాల్లో కల్వర్టులు ప్రమాదకరంగా మారుతున్నాయి. కల్వర్టులపై నుంచి బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. శిథిలావస్థ దశకు చేరిన కల్వర్టులపై నుంచే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.

ప్రమాదకరంగా కల్వర్టులు

  ప్రమాదాలబారిన ప్రయాణికులు 

  పట్టించుకోని అధికారులు 

బోధన్‌ రూరల్‌, డిసెంబరు 19: బోధన్‌లోని పలు ప్రాంతాల్లో కల్వర్టులు ప్రమాదకరంగా మారుతున్నాయి.  కల్వర్టులపై నుంచి బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. శిథిలావస్థ దశకు చేరిన కల్వర్టులపై నుంచే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. పట్టణంలోని శక్కర్‌నగర్‌ చౌరస్తా నుంచి తట్టికోటకు వెళ్లే దారిలో ఉన్న కల్వర్టు ప్రమాదకరంగా మారింది. నిత్యం వంద లాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ఎప్పుడు కూలిపోతుందోనని కాలనీ వాసులు, ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు. ప్రమాదం సంభవించక ముం దే సంబఽంధిత శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు. అదే విధం గా బస్సు డిపో పక్కన గల డాక్టర్స్‌ ఏరియాలోని   కాలనీలోకి వెళ్లాలంటే కాలనీ వాసులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలనీలోకి వెళ్లే రహదారిపై గుంత ఏర్పడటంతో రాకపోకలకు ప్రమాదకరంగా మారింది. కాలనీలో నిత్యం వందలాది మంది రాకపోకలు సాగి స్తుంటారు. కాలనీకి వెళ్లే మలుపులో గుంత ఏర్పడటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కాలనీలో ఉండే వాహనదారులు రాకపోకలు సాగించాలంటే ఆందోళనకు గురవుతున్నారు. మలుపులో ఉన్న గుంతలో వాహనాలు ఇరుక్కుపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాత్రి సమయాల్లో గుంతలు ఏర్పడక వాహనదారులు గుంతలో పడి ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి పట్టణంలో పలు కాలనీల్లో ప్రమాదకరంగా మారిన కల్వర్టులను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

కల్వర్టులకు మరమ్మతులు చేపడతాం..

: రామలింగం, కమిషనర్‌, బోఽధన్‌ 

శిథిలావస్థకు, ప్రమాదాలకు నిలయంగా మారిన కల్వర్టులను పరిశీలించి మరమ్మతులు చేస్తాం. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న కల్వర్టులను సంబంధిత శాఖ అధికారులచే పర్యవేక్షణ జరిపించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పూర్తి స్థాయి చర్యలు చేపడతాం. 

Updated Date - 2021-12-20T05:28:47+05:30 IST