ఎన్‌ఆర్‌ఐకి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-12-31T05:29:55+05:30 IST

జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐకి గురువారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చిన ఆయన.. ఆయన తీవ్ర దగ్గు, జలు బు, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండడంతో బుధవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నాడు. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో రక్త నమూనాలు సేకరించి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల నిమిత్తం నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఆర్‌టీపీసీఆర్‌లోనూ పాజిటివ్‌ వస్తే ఒమైక్రాన్‌ టెస్ట్‌ కోసం హైదరాబాద్‌కు పంపనున్నారు.

ఎన్‌ఆర్‌ఐకి కరోనా పాజిటివ్‌

 అమెరికా నుంచి ఇటీవలే కుటుంబంతో వచ్చిన ఎల్లారెడ్డి వాసి 

 తీవ్ర దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వైనం

 ఒమైక్రాన్‌ అన్న అనుమానం!?

ఎల్లారెడ్డి, డిసెంబరు 30: జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐకి గురువారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చిన ఆయన.. ఆయన తీవ్ర దగ్గు, జలు బు, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండడంతో బుధవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నాడు. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో రక్త నమూనాలు సేకరించి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల నిమిత్తం నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఆర్‌టీపీసీఆర్‌లోనూ పాజిటివ్‌ వస్తే ఒమైక్రాన్‌ టెస్ట్‌ కోసం హైదరాబాద్‌కు పంపనున్నారు. అయితే అమెరికా నుంచి వచ్చినందు వల్ల సదరు ఎన్‌ఆర్‌ఐకి ఒమైక్రాన్‌ సోకి ఉంటుందా!? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య పరీక్షల అనంతరం ఈ విషయం నిర్ధారణ కానుంది. కొవిడ్‌ భారిన పడిన ఎన్‌ఆర్‌ ఐని క్వారంటైన్‌లో ఉంచి ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రి వైద్యుడు రవీంద్రమోహన్‌ చికిత్సను అందిస్తున్నారు. అయితే ఎన్‌ఆర్‌ఐ భార్యాపిల్లలకు పరీక్షలు నిర్వహించగా.. ఎలాంటి కొవిడ్‌ లక్షణాలు లేవు.

Updated Date - 2021-12-31T05:29:55+05:30 IST