అన్నిరంగాలపై కరోనా ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2021-05-15T06:18:17+05:30 IST

కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ జిల్లాలో పకడ్బందీగా అమలవుతోంది. వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రజలు ఉదయం సడలింపు సమయం లో మినహా ఇతర సమయాల్లో ఇళ్లను విడిచి బయటకు రావడంలేదు. అయితే, లాక్‌డౌన్‌ ప్రభావం మాత్రం అన్ని రం గాలపై కనిపిస్తోంది.

అన్నిరంగాలపై కరోనా ఎఫెక్ట్‌

నిలిచిన భూములు, వాహనాల రిజిస్ట్రేషన్లు
ప్రభుత్వానికి భారీగా తగ్గుతున్న ఆదాయం
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు
పకడ్బందీగా అమలవుతున్న లాక్‌డౌన్‌
రహదారులపై తగ్గిన వాహనాల రాకపోకలు
వ్యాప్తి తగ్గుతుందంటున్న వైద్య నిపుణులు

నిజామాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ జిల్లాలో పకడ్బందీగా అమలవుతోంది. వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రజలు ఉదయం సడలింపు సమయం లో మినహా ఇతర సమయాల్లో ఇళ్లను విడిచి బయటకు రావడంలేదు. అయితే, లాక్‌డౌన్‌ ప్రభావం మాత్రం అన్ని రం గాలపై కనిపిస్తోంది. భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిత్యావసర వ స్తువులను ధరలను పెంచి అమ్ముతున్నారు. అయితే, లాక్‌డౌన్‌ వల్ల కొవిడ్‌ ప్రభావం మాత్రం గణనీయంగా తగ్గుతుం దని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ప్రభుత్వ శాఖలపై లాక్‌డౌన్‌ ప్రభావం
జిల్లాలో లాక్‌డౌన్‌ ప్రభావం ప్రభుత్వ శాఖలపై పడింది. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, ర వాణాశాఖ కార్యక్రమాలను నిలిపివేశారు. వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయాయి. లాక్‌డౌన్‌ సందర్భ ంగా భూముల రిజిస్ట్రేషన్లకు వచ్చే వారికి ఇబ్బందులు ఉం డడంతో నిలిపివేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పది సబ్‌ రి జిస్ట్రార్‌ కార్యాలయాలు తెరిచి ఉంచి.. ఉద్యోగులు విధులకు వస్తున్నా రిజిస్ట్రేషన్లు మాత్రం చేయడం లేదు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రే షన్లు కూడా కావడం లేదు. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లద్వారా రోజుకు రూ.అర కోటి వరకు వస్తుంది. లాక్‌డౌన్‌తో రిజిస్ట్రేషన్ల సైట్‌ను కూడా నిలిపివేశారు. రవాణాశాఖ ద్వారా ఇచ్చే లైసెన్స్‌ల జారీ కూ డా ఆగిపోయింది. వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా చేయడం లేదు. ఉద్యోగులు విధులకు మాత్రం హాజరవుతున్నారు. వా ణిజ్య పన్నుల శాఖకు చెల్లించే పన్నులు కూడా తగ్గినట్లు తె లుస్తోంది. వ్యాపారులు వ్యాపారంను బట్టి పన్నులు చెల్లిస్తా రు. ఇప్పుడు చెల్లింపులు నిలిచినా వచ్చే నెలలో పెరుగుతా యని అధికారులు తెలిపారు. బస్సులు తిరగపోవడం వల్ల ఆర్టీసీకి కూడా భారీ నష్టం వాటిల్లుతోంది. 4గంటలే సడలిం పు ఉండడం వల్ల ఎక్కువ సర్వీసులను తిప్పడం లేదు. బ స్సులు డిపోలకే పరిమితమవుతున్నాయి. మద్యం ద్వారా మాత్రం ఆదాయం పెరిగింది. లాక్‌డౌన్‌ వల్ల మద్యం అమ్మ కాలు భారీగా జరుగుతున్నాయి.

వ్యాపార, వాణిజ్య సంస్థలకూ తప్పని నష్టం
జిల్లాలో వాణిజ్య, వ్యాపార సంస్థలకూ లాక్‌డౌన్‌ వల్ల న ష్టం తప్పడం లేదు. లాక్‌డౌన్‌ సడలింపు సమయం ఉదయ ం కేవలం 4గంటలు మాత్రమే ఇవ్వడం వల్ల వాణిజ్య, వ్యా పార సంస్థలను ఎక్కువగా తీయడం లేదు. కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండడం వల్ల షాపుల యజమానులు కూడా సంస్థలను మూసివేసే ఉంచుతున్నారు. లాక్‌డౌన్‌ పేరుతో నిత్యావసర వస్తువుల ధరలను మాత్రం భారీగా పెంచారు. గతంలోనే స్టాక్‌ వచ్చినా లాక్‌డౌన్‌తో రావడం లేదని దుకా ణాదారులు ధరలు పెంచి అమ్ముతున్నారు. నిత్యావసర వ స్తువుల సరఫరాకు అనుమతులున్నా వ్యాపారులు మాత్రం  నిర్ణయించిన ధరకు అమ్మడం లేదు. నూనెల నుంచి పప్పుల వరకు అన్ని ధరలను పెంచారు. కూరగాయలు, పండ్ల ధర లను కూడా పెంచి విక్రయిస్తున్నారు. ఈ దుకాణాలపై అధి కారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల వ్యాపారులు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే కొనుగోలుదారులకు మేలు జరిగే అవకాశం ఉంది.


లాక్‌డౌన్‌తో కరోనా తగ్గే అవకాశం
కరోనా కట్టడికి ఈ లాక్‌డౌన్‌ ఎంతో ఉపయోగపడుతుం దని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందరూ ఇ ళ్లకే పరిమితం కావడం వల్ల వైరస్‌ వ్యాప్తి తగ్గుతుందని వారు వివరిస్తున్నారు. వైరస్‌ చైన్‌ ఆగిపోతే కేసులు ఆగిపో తాయని వారు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో అవసరం ఉంటే తప్ప బయటకు రా వొద్దని వారు సూచిస్తున్నారు. అత్యవసర పనుల మీద బ యటకు వచ్చేవారు తప్పనిసరి మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టరు బాల నరేంద్ర తెలిపారు. ప్రతిఒక్కరూ లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్లల్లోనే ఉంటే వైరస్‌ వ్యాప్తి తగ్గిపోతుందన్నారు. లాక్‌డౌన్‌ వల్ల రిజిస్ట్రేషన్లు జరగడం లేదని ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్‌ రవీందర్‌ రావు తెలి పారు. లాక్‌డౌన్‌ తర్వాతనే మళ్లీ మొదలవుతాయని ఆయన తెలిపారు. ఉమ్మడి జిల్లాలో డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు జరగడం లేదని రవాణాశాఖ ఉప కమిషనర్‌ డాక్టర్‌ వెంకట రమణ తెలిపారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వా త యథావిధిగా కొనసాగుతాయని ఆయన అన్నారు.


మూడో రోజూ కట్టుదిట్టంగా
జిల్లాలో మూడో రోజైన శుక్ర వారం లాక్‌డౌన్‌ కట్టుదిట్టం గా కొనసాగింది. రంజాన్‌ ప ండుగను ముస్లింలు నిరాడ ంబరంగా జరుపుకొన్నారు. సడలింపు సమయంలోనే మ సీదులకు వచ్చారు. కొవిడ్‌ ప్రభావంతో ఎక్కువగా ఇళ్లల్లో నే ప్రార్థనలు నిర్వహించారు. లాక్‌డౌన్‌ సందర్భంగా జి ల్లాలోని అన్ని ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార సంస్థలను మూసివేశారు. రంజాన్‌ సెలవు కారణంగా ప్రభుత్వ సం స్థలు పనిచేయలేదు. జిల్లా సరిహద్దుల వద్ద వాహనాల ను కట్టడి చేశారు. జాతీయ రహదారులు మినహా ఇతర రహదారులపైకి వచ్చిన వాహనాలను పోలీసులు తనిఖీ లు చేశారు. అత్యవసర, గూడ్స్‌ వాహనాలు మినహా ఇత ర వాహనాలను అనుమతించ లేదు. సడలింపు సమ యం ముగిసిన తర్వాత బయటకు వచ్చినవారిని తిప్పి పంపించారు. దుకాణాలు తెరిచి ఉంచిన వారిపై కూడా చర్యలు తీసుకున్నారు. కొన్ని దుకాణాలు, వాహనదారుల పై కేసులు నమోదు చేశారు.

Updated Date - 2021-05-15T06:18:17+05:30 IST