కరోనా కట్టడికి.. ఇంటిటి సర్వే

ABN , First Publish Date - 2021-05-08T05:33:48+05:30 IST

జిల్లాలో కరోనా వ్యాప్తి గత రెండు నెలలుగా ఎక్కువ అవు తోంది. మహారాష్ట్ర ప్రభావంతో కేసులు భారీగా నమో దు అవుతున్నాయి. కొవిడ్‌ వచ్చిన వారిలో కొంత మం దికి ఒకటి రెండు రోజుల్లోనే తీవ్రత పెరుగుతోంది.

కరోనా కట్టడికి.. ఇంటిటి సర్వే

జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ

1200 ప్రత్యేక బృందాల ఏర్పాటు

కొవిడ్‌ లక్షణాలు గుర్తిస్తూ వివరాల నమోదు

లక్షణాలు ఉన్న వారందరికీ మందుల కిట్ల పంపిణీ

నిజామాబాద్‌, మే7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా వ్యాప్తి గత రెండు నెలలుగా ఎక్కువ అవు తోంది. మహారాష్ట్ర ప్రభావంతో కేసులు భారీగా నమో దు అవుతున్నాయి. కొవిడ్‌ వచ్చిన వారిలో కొంత మం దికి ఒకటి రెండు రోజుల్లోనే తీవ్రత పెరుగుతోంది. ఆక్సీజన్‌ శాతం తగ్గడం, శ్వాస సమస్యలు తలేత్తుతుం డడంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ చికిత్స పొం దుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో కేసులు నమో దు అవుతుండగా ఆసుపత్రుల్లో చేరేవారు కూడా ఎ క్కువగా ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్‌ నిం డిపోగా సత్వర చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. లక్షల రూపాయాలు వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రైవేటులో ఆక్సిజన్‌, ల్యాబ్‌ టెస్టు లు, మందులు ముఖ్యంగా రెమ్‌డెసివీర్‌ పేరిట భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితు లలో అప్పులు చేసి చికిత్స కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులపై పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇది కొనసాగుతోంది.

ముందుగా లక్షణాల గుర్తింపు..

జిల్లాలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడం, నిత్యం టెస్టులు ఆసుపత్రుల పరిధిలో చేసిన ఎక్కువగా వ స్తుండడంతో గ్రామాల వారీగా ఇంటింటి సర్వే చేప ట్టారు. ముందుగానే కొవిడ్‌ లక్షణాలు గుర్తించి టెస్టు లు లేకుండానే చికిత్స మొదలు పెట్టేందుకు ఈ సర్వే చేపట్టారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని ముందే గుర్తి స్తే వ్యాప్తి తగ్గడంతోపాటు సీరియస్‌ కాకముందే మందులు వాడితే త్వరగా తగ్గుతుందని నిర్ణయం తీ సుకున్నారు. జిల్లాలో మూడు రోజుల క్రితం సర్వే ను చేపట్టారు. ఈ సర్వేలో ఆశా వర్కర్‌లు, అంగన్‌ వాడీ టీచర్లు, వైద్య ఉద్యోగులు, పంచాయతీ కార్యద ర్శులతో పాటు ఇతర సిబ్బందిని వినియోగిస్తున్నారు. జిల్లాలో మొత్తం 1200 పైగా బృందాలను ఏర్పాటు చే శారు. వీరి ఆధ్వర్యంలో ఈ సర్వేను కొనసాగిస్తున్నారు. ప్రతీ బృందం రోజుకు వెయ్యి మందికి తగ్గకుండా సర్వే చేసే విధంగా చూస్తున్నారు. ఏ రోజుకు ఆరోజు వారి చ్చే ఫీడ్‌ బ్యాక్‌ను గ్రామాల వారీగా నమోదు చేస్తున్నారు. 

 వివరాల సేకరణ

ఈ సర్వేలో పలు అంశాలపై వివరాలను సేకరి స్తున్నారు. జిల్లాలో ఇంటింటికీ తిరుగుతున్నా బృందం సభ్యులు ఆ ఇంటిలో ఎంత మంది ఉన్నారు. వారికి జ్వరం లక్షణాలు ఉన్నాయా, ఉంటే ఎంత మందికి ఉ న్నాయో, వారిలో కొవిడ్‌ లక్షణాలు ఉన్నాయో పరిశీ లిస్తున్నారు. వారు కొవిడ్‌ టెస్టు చేసుకున్నారా, పాజి టివ్‌ వచ్చిన వారు ఎంత మంది ఉన్నారు వంటివి పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చి న వారు హోం ఐసోలేషన్‌లో ఎంత మంది ఉన్నారో లెక్కలు తీస్తున్నారు. వీరితో పాటు చికిత్స కోసం ఎవరె నా ఆసుపత్రుల్లో చేరారా, చేరితే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వివరాలు తీసుకుంటున్నారు. ఇవే కాకుం డా గతంలో ఆ ఇంటిలో పాజిటివ్‌ వచ్చి తగ్గిన వారు కానీ, మృతి చెందిన వారి వివరాలు తీసుకుంటున్నారు. కొవిడ్‌ లక్షణాలు స్వల్పంగా ఉన్న మందులను ఇస్తు న్నారు. హోం ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడా లని కోరుతున్నారు. లక్షణాలు ఉన్నవారి వివరాలను గ్రామ సర్పంచ్‌, కార్యదర్శికి ఇస్తున్నారు. వారు క్వారం టైన్‌ సమయం అయ్యే వరకు పరిశీలించాలని కోరు తున్నారు. జిల్లాలోని బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సి పాలిటీలతో పాటు నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధి లోనూ చేస్తున్నారు. ఈ సర్వేను నిత్యం కలెక్టర్‌ నారా యణ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఆయన శుక్రవారం డిచ్‌ప ల్లి మండలంలో పర్యటించారు. అధికారులను వివ రాలు అడిగి తెల్సుకున్నారు. అదనపు కలెక్టర్‌ లత ఆకుల కొండూర్‌తో పాటు ఇతర గ్రామాల్లో జరు గుతున్న సర్వేను పరిశీలించారు. జిల్లాలోని వైద్య, పం చాయతీ, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మండల స్థాయిలో పర్యటించి పరిశీలిస్తున్నారు.  ఉద్యో గులకు అండగా ఉంటు సర్వే సక్రమంగా జరిగేలా చూస్తున్నారు. జిల్లాలో కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారిని ముందే గుర్తించి చికిత్స అందించేందుకే ఈ సర్వే చేస్తున్నామని కలెక్టర్‌ నారయణ రెడ్డి తెలిపారు. లక్షణాలు ఉన్నవారందరికీ కొవిడ్‌ మందుల కిట్లను అందిస్తున్నామని వివరించారు. సీరియస్‌గా ఉన్న వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందే విధంగా ఏర్పాట్లను చేశామని తెలిపారు. మందులు, ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నామనారు. ముందుగానే లక్షణాలు గుర్తిస్తే వ్యాప్తి అరికట్ట వచ్చని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

2021మందికి లక్షణాల గుర్తింపు

నిజామాబాద్‌అర్బన్‌, మే 7: జిల్లావ్యాప్తంగా 530 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీల్లో 1204 ఆరోగ్య బృందాలు 87వేల 483 ఇళ్లలో సర్వే నిర్వహించగా 2021 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు కలెక్టర్‌ తెలిపారు. 1804 మందిని ఓపీలో వైద్య పరీక్షలు చేసి  414 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి మందులు ఇచ్చినట్లు తెలిపారు. శనివారం కూడా జిల్లావ్యాప్తంగా ఇంటింటి సర్వే, ఓపీ సేవలు నిర్వహిస్తామని ప్రజలు ఎవరైనా అనారోగ్య సమస్యలున్నవారు ఇంటింటి సర్వేకు వచ్చే బృందాలకు తమ సమస్యలు చెబితే వారు ఇచ్చే మందుల ద్వారా సత్వర వైద్యం పొందవచ్చని కలెక్టర్‌ తెలిపారు. ఆరోగ్య బృందాలకు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.

Updated Date - 2021-05-08T05:33:48+05:30 IST