మరోసారి వంట గ్యాస్‌ ధర పెంపు

ABN , First Publish Date - 2021-02-06T04:52:53+05:30 IST

ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతు ంటే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను తరచూ పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోంది. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.100కు చేరువ కాగా.. సబ్సిడీ గ్యాస్‌ ధరను 3 నెలల్లో మూడుసార్లు పెంచేసి రూ.780కి చేర్చింది. ఇలా వంటగ్యాస్‌ ధర తరచూ పెరగ డంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను ఆందోళన ప రుస్తోంది.

మరోసారి వంట గ్యాస్‌ ధర పెంపు

సామాన్యుడిపై కేంద్ర సర్కారు బాదుడు

సిలిండర్‌పై మరోసారి రూ.25 పెంపు

మూడు నెలల్లో మూడు సార్లు పెరిగిన ధర

సబ్సిడీయేతర సిలిండర్‌ ధర భారీగా పెంపు

రవాణా చార్జీల పేరిట అదనపు దోపిడీ

ఉమ్మడి జిల్లా వినియోగదారులపై రూ.13 కోట్ల అదనపు భారం


కామారెడ్డి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతు ంటే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను తరచూ పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోంది. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.100కు చేరువ కాగా.. సబ్సిడీ గ్యాస్‌ ధరను 3 నెలల్లో మూడుసార్లు పెంచేసి రూ.780కి చేర్చింది. ఇలా వంటగ్యాస్‌ ధర తరచూ పెరగ డంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను ఆందోళన ప రుస్తోంది. మరోవైపు రవాణా చార్జీల పేరిట గ్యాస్‌ డిస్టిబ్యూ టర్‌లు దూరాన్ని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరో పణలు వస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు, అ దనపు వసూళ్లతో వంటగ్యాస్‌ సిలిండర్‌ సామాన్యులు మో యలేనంత బరువెక్కుతోంది. మరోవైపు ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్‌పై సబ్సిడీ నిధులను ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖా తాలో జమచేయకుండా ఎత్తివేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


ఉమ్మడి జిల్లాపై రూ.13 కోట్ల భారం

వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరను కేంద్ర ప్రభుత్వం మరోసారి రూ.25 పెంచడంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వినియోగ దారులపై ప్రతినెలా రూ.13 కోట్ల అదనపు భారం పడనున్న ట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిజా మాబాద్‌ జిల్లాలో 30 వరకు గ్యాస్‌ ఏజెన్సీలు ఉండగా.. సు మారు 3లక్షల వరకు కనెక్షన్‌లు ఉన్నాయి. ప్రస్తుతం పెంచి న గ్యాస్‌ ధరతో నిజామాబాద్‌ జిల్లా గ్యాస్‌ వినియోగదారు లపై రూ.7.5 కోట్ల అదనపు భారం పడనుంది. అదే విధంగా కామారెడ్డి జిల్లాలో 20 గ్యాస్‌ ఏజెన్సీలు ఉండగా.. మొత్తం 2.20 లక్షల గ్యాస్‌ కనెక్షన్‌లున్నాయి. ఈ లెక్కన కామారెడ్డి జిల్లా వినియోగదారులపై రూ.5.5కోట్ల భారం పడనుంది.


మూడు నెలల్లో మూడు సార్లు పెంపు

కేంద్ర ప్రభుత్వం మూడు నెలల కాలంలో మూడు సార్లు గ్యాస్‌ సిలిండర్‌ ధరను భారీగా పెంచింది. గత సంవత్సరం డిసెంబరు నెలమొదటి వారంలో సిలిండర్‌ ధరను రూ.50 పెంచింది. అది గడిచిన 15 రోజులకే మరో రూ.50 ధరను పెంచడంతో సిలిండర్‌ ధర రూ.764.50 కు చేరింది. అయితే ధర పెంచి నెల గడవకముందే ప్రభుత్వం మరోసారి గ్యాస్‌ ధరను పెంచుతున్నట్టు ప్రకటించింది. తాజాగా సబ్సిడీ గ్యాస్‌పై రూ.25 పెంచడంతో సిలిండర్‌ ధర రూ.789.50కు చేరింది. అదే విధంగా వాణిజ్య సిలిండర్‌పై రూ.184లు పెం చారు. ఈ ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. 


సామాన్య ప్రజల మండిపాటు

గ్యాస్‌ ధర పెంపుపై సామాన్య ప్రజలు మండిపడుతు న్నారు. మూడు నెలల కాలంలోనే ధరను మూడుసార్లు పెంచడం మంచిది కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నా రు. నిత్యావసరానికి ఉపయోగించే వంటగ్యాస్‌ ధర భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వంటగ్యాస్‌ ధర మండిపోతోందని, కొనుగోలు చేసి న గ్యాస్‌ సిలిండర్‌ను పొదుపుగా వాడుకోవాల్సి వస్తోందం టున్నారు.

ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలి ండర్‌లను ఉపయోగించలేని పరిస్థితి తీసుకువస్తోందని ప్ర జలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్‌ధర పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చే యలేని పరిస్థితి ఏర్పడనుంది. దీంతో వంట చేసుకునేందుకు కట్టెల పొయ్యే దిక్కవుతుందని ప్రజలు వా పోతున్నారు.


రవాణా చార్జీల పేరిట దోపిడీ

ఉమ్మడి జిల్లాలో గ్యాస్‌ ఏజెన్సీలు రవాణా చార్జీల పేరిట వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్‌ ఏజెన్సీలు 5 కిలో మీటర్ల పరిధి లో ఉచితంగా డోర్‌ డెలివరీ చేయాలి. 30 కిలో మీటర్ల లోపు రూ.10లు, అంతకు దూరం పెంచినప్పుడల్లా రవాణా చార్జీ లు రూ.5 నుంచి రూ.10 వరకు పెంచుకుంటూ పోతున్నా రు. కొన్ని ఏజెన్సీలు డోర్‌ డెలవరీ చేయలేమని, తమ వద్దకే వచ్చి తీసుకెళ్లాలని షరతులు పెడుతున్నాయి. దీంతో విని యోగదారులు అవసరం కొద్ది అదనంగా సొమ్ము చెల్లించి గ్యాస్‌ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.


ఒక్కో సిలిండ ర్‌ను డెలవరీ చేయాలంటే డెలవరీ బాయ్‌ సిలిండర్‌కు రూ.20 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తు తం ప్రభుత్వం పెంచిన ధరల ప్రకారం ఎల్‌పీజీ గ్యాస్‌ ధర రూ.789. డెలవరీ బాయ్‌ చార్జీలు కలుపుకొంటే రూ.830కి చే రుతోంది. ఇలా ధరలు పెరగడంతో వినియోగించలేని పరిస్థి తి ఎదురవుతోందని వినియోగదారులు పేర్కొంటున్నారు.


పల్లెల్లో అటకెక్కనున్న సిలిండర్‌

గ్రామీణ ప్రాంతాల్లో వంటచెరుకు వినియోగాన్ని తగ్గించే ందుకు దీపం పథకం, ప్రధాన మంత్రి ఉజ్వల యోజనలో సబ్సిడీపై గ్యాస్‌ కనెక్షన్‌లు ఇచ్చారు. అడవుల రక్షణ, మహిళ ల అనారోగ్యం దృష్ట్యా ఈ పథకాలను అమలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు కనెక్షన్‌ లు తీసుకున్నాక ధరలు పెంచుతూ వారు మోయలేనంత భారం మోపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వారం రోజులు కష్టపడి సంసాదించిన కూలి డబ్బులను సిలిండర్‌కే వెచ్చిస్తే.. మిగతా అవసరాలు ఎలా తీరుతాయో అర్థం కావ డం లేదని మహిళలు అంటున్నారు. పెరుగుతున్న ధరలతో మళ్లీ కట్టెల పొయ్యినే నమ్ముకునే పరిస్థితి వస్తుందని ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.


గ్యాస్‌ సరఫరాకు అదనపు చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు

చంద్రశేఖర్‌ (అదనపు కలెక్టర్‌, నిజామాబాద్‌)

నిజామాబాద్‌ అర్బన్‌, ఫిబ్రవరి 5: వినియోగదారులకు గ్యాస్‌ సరఫరా చేసే డెలివరీ బాయ్‌లకు అదనపు చార్జీలు చెల్లించవలసిన అవసరం లేదని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్‌పీజీ గ్యాస్‌ ఏజెన్సీల ద్వారా సరఫరా చేసే గ్యాస్‌ సిలిండర్లకు డెలివరీ బాయ్‌ బిల్లు కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్న ట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీలు డెలివరీ బాయ్‌లకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. లేదంటే సంబంధిత ఏజెన్సీలపై నిబ ంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.


గ్యాస్‌ గోదాం నుంచి స్వయంగా గ్యాస్‌ తీసుకెళ్లే వినియోగదారులకు బిల్లు కంటే 18 రూపాయలు రిబేట్‌ ఇవ్వాలని ఆయన సూచించారు. గ్యాస్‌ సరఫరాకు పేర్లు బుక్‌ చేసుకున్న వారి పెండింగ్‌ జాబితాను సీనియార్టీ ప్రకారం గ్యాస్‌ ఏజెన్సీల కార్యాలయాల వద్ద సీ నియారిటీ జాబితాను ప్రదర్శించాలన్నారు. గ్యాస్‌ సరఫరా సమయంలో వినియోగదారుని ఇంటికి తాళం వేసి ఉన్నట్లయితే మరుసటి రోజు గ్యాస్‌ సరఫరా చేయాలని, ఈ విషయంలో ఏజెన్సీలు నిబంధనలను అతిక్రమించకూడదని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2021-02-06T04:52:53+05:30 IST