పాజిటివ్‌ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్‌లు ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-05-30T05:37:57+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువ ఉన్న ప్రాం తాల్లో మైక్రో కంటైన్మెంట్‌జోన్‌లు, ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాట్లలో టీములు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు.

పాజిటివ్‌ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్‌లు ఏర్పాటు చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డి టౌన్‌, మే 29: కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువ ఉన్న ప్రాం తాల్లో మైక్రో కంటైన్మెంట్‌జోన్‌లు, ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాట్లలో టీములు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొవిడ్‌ నియంత్రణ, లాక్‌డౌన్‌, ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి బీబీపేట, దోమకొండ, రాజీవ్‌ నగర్‌, దేవునిపల్లి ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని, వీటి కట్టడికి మైక్రో కంటైన్మెంట్‌ జోన్‌లు ఏర్పాటు చేయాలని, పాజిటివ్‌ కలిగిన వారిని ఇళ్లలో నుంచి బయటకు తిరగనివ్వకుండా ప్రత్యేకంగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో హోం ఐసోలేషన్‌ను ఏర్పాటు చేయా లని తెలిపారు. ఆశ, ఏఎన్‌ఎం, వీఆర్‌వో, పంచాయతీ సెక్రెటరీలతో రెండు టీంల ఏర్పాటుతో రోజుకు ఉదయం సాయంత్రం వారి ఆరోగ్య పరిస్థితిని గమనించాలన్నారు. టీములు రిలాక్స్‌డ్‌గా ఉండవద్దని, పాజిటివ్‌ కలిగిన వారు బయట తిరిగితే కష్టం వృథా అవుతుందని, నష్టం ఎక్కువవుతు ందని అన్నారు. ఏ గ్రామంలో ఒక పాజిటివ్‌ ఉన్నా ఉదయం సాయంత్రం వారి పర్యవేక్షణ అతి ముఖ్యమని అన్నారు. మొదటి విడత సర్వేలో లక్షణా లను గుర్తించిన వారి పట్ల క్రాస్‌ చెక్‌ చేసుకోవాలని, వారు ఇళ్లలో ఉంటు న్నారా లేదా చూడాలని, వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను ఐసోలేషన్‌ చేయాల ని తెలిపారు. జిల్లాలో సర్వేలో గుర్తించిన 6,861 మందికి కిట్స్‌ అందజేయ డం వల్ల 14 మందికి మాత్రమే ఐదు రోజుల తర్వాత కూడా రికవరి కాలేదని, వారికి చికిత్స అందించడం జరిగిందని తెలిపారు. అలాగే ఓపీ సర్వీసులు నిర్వహించాలని, లక్షణాలు ఉన్నవారికి కిట్స్‌ అందించాలని తెలిపారు. ఆసుపత్రులలో ఎలాంటి చెత్త కనబడరాదని, పరిశుభ్రంగా ఉం చాలని, లైట్లు పని చేయాలని, టాయ్‌లెట్స్‌ పరిశ్రుభంగా ఉంచాలని ఆదేశి ంచారు. సూపర్‌ స్ర్పెడర్స్‌లో భాగంగా జర్నలిస్టులు, రేషన్‌షాపు, పెట్రోల్‌ బంక్స్‌, గ్యాస్‌ డిస్ర్టిబ్యూటర్స్‌, వ్యవసాయ సంబంధిత విత్తన, ఎరువుల డీలర్లు, వారి సిబ్బందికి రెండు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ చేయ డం జరిగిందని తెలిపారు. లాక్‌డౌన్‌లో పోలీసు సిబ్బంది సమర్థవంతంగా పని చేస్తున్నారని, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల సమయంలో కూడా నిబంధనలను అతిక్రమించిన వారికి జరిమానాలు విధించాలని, గ్రామాల తో పాటు తండాల్లో ఎక్కువ దృష్టి సారించాలని తెలిపారు. ధాన్యం కొను గోళ్లపై సమీక్షిస్తూ ఇప్పటి వరకు అందరి సహకారంతో కొనుగోళ్లు బాగా నిర్వహించడం జరుగుతున్నదన్నారు. ఇంకా 30వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోళ్లు చేయవలసి ఉన్నదని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెల 31లోగా కొనుగోళ్లు పూర్తి చేయాలని తెలిపారు. ఆదివారం సైతం పనిచేసి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ చార్జ్‌ అదనపు కలెక్టర్‌ వెంకట మాధవరావు, ఏఎస్‌పీ అనోన్య, డీఎంహెచ్‌ వో చంద్రశేఖర్‌, డీసీహెచ్‌ఎస్‌ అజయ్‌కుమార్‌, ఆర్‌డీవో శ్రీను, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మీ, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-30T05:37:57+05:30 IST