ఢిల్లీ రైతులకు మద్దతుగా అఖిలపక్ష నేతల ఆందోళన
ABN , First Publish Date - 2021-02-07T05:07:45+05:30 IST
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ లో 72 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు.. జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని ఇచ్చిన పిలుపు మే రకు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అఖిలపక్ష నేతలు రాస్తారోకో నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
స్పందించే వరకు పోరు ఆపబోమని హెచ్చరిక
కామారెడ్డి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి)/మోపాల్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ లో 72 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు.. జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని ఇచ్చిన పిలుపు మే రకు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అఖిలపక్ష నేతలు రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాద్ రోడ్డులో ని బోర్గాం(పి)బ్రిడ్జిపై నిర్వహించిన ఈ రాస్తారోకోలో అ ఖిలపక్ష నాయకులు తాహెర్‌బిన్ హుందాన్, వి.ప్రభాకర్, ఆకుల పాపయ్య, పెద్ది వెంకట్రాములు, రమేష్ బాబు, నూర్జహాన్, సబ్బని లత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రం రైతు వ్యతిరే క చట్టాలను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని మరి ంత తీవ్రతరం చేస్తామనిని హెచ్చరించారు. ఢిల్లీలో గత 72 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా ప్రధానమం త్రి నరేంద్రమోదీ పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు ఉద్యమం దేశ వ్యాప్తంగా ఉధృతం అవుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా వ్య వహరిస్తోందని మండిపడ్డారు. పోలీసు బలగాలతో రైతు ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఈ ఉద్యమం ఏ ఒక్కరి చేతిలో లేదని, దేశ వ్యాప్తంగా రైతులే రోడ్లమీదికి వచ్చి ఆందోళన చేస్తున్నారన్నారు. రా స్తారోకోతో రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ట్రా ఫిక్ పోలీసులతో పాటు నగర పోలీసులు నాయకులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు.
కామారెడ్డి జిల్లాలోనూ పలు మండలాల్లో కాంగ్రెస్, వామపక్షపార్టీల నేతలు రైతులకు మద్దతుగా జాతీయ ర హదారులను దిగ్బంధించి నిరసన చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టెక్రియాల్, భిక్కనూరు వద్ద 44వ జా తీయ రహదారిపై, పెద్దకోడప్‌గల్, ఎల్లారెడ్డి తదితర మ ండలాల్లో రహదారులపై రాస్తారోకో, ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థకు లబ్ధిచేకూరే లా మూడు నల్లచట్టాలను తీసుకువచ్చి రైతులందరికీ మరణశాసనం రచించిందని అన్నారు. ఢిల్లీలో రోడ్లపై క నీసం నడవకుండా మేకులు, గోడలు కట్టించడంతో పా టు రైతులపై అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమాన్ని అర్థం చేసు కుని వెంటనే రైతువ్యతి రేకచట్టాలను రద్దుచేయాలని డి మాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు గంగాధర్, గణేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్‌గౌడ్, సీపీఐ జిల్లా అధ్యక్షుడు దశరథ్, జేఏసీ కన్వీనర్ జగన్నా థం తదితరులు పాల్గొన్నారు.